E-Paper
Advertisement

“అయ్యగారు అఖిల్”కి అభిమాని కొత్త పేరు.. భలే ఉందే!

“అయ్యగారు అఖిల్”కి అభిమాని కొత్త పేరు.. భలే ఉందే!
Advertisement

Lenin movie:సాధారణంగా హీరోలకు, హీరోయిన్లకు అభిమానులు కొత్తగా పేర్లు పెట్టడం చూస్తూనే ఉంటాం. కొంతమంది నచ్చితే అభిమానులు పెట్టిన పేర్లనే తమ పేర్లుగా మార్చుకొని.. చలామణి అవుతూ ఉంటారు. పైగా అభిమానులు పెట్టే పేర్లతో ఆ సెలబ్రిటీలు స్టార్ హోదాను దక్కించుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే అఖిల్ అక్కినేనికి మరోసారి మరో అభిమాని మరో కొత్త పేరు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఆ కొత్త పేరులో ఉన్న ఆంతర్యం చెప్పి సర్ప్రైజ్ చేశారు. మరి అఖిల్ కి అభిమాని పెట్టిన ఆ కొత్త పేరు ఏంటి? ఆ కొత్త పేరులో ఉన్న ఆంతర్యం ఏమిటి? అనే విషయం ఎప్పుడు చూద్దాం..

ఘనంగా లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్..

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని.. తాజాగా నటిస్తున్న చిత్రం లెనిన్. చివరిగా ఆయన ఏజెంట్ సినిమాలో నటించారు. ఈ సినిమాతో సక్సెస్ గా అందుకోవాలని పరితపించారు. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో గుర్తింపును అందించలేదు. ఇక మూడేళ్ల విరామం తీసుకుని మళ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నేడు ఆదివారం సాయంత్రం తిరుపతిలో నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

అఖిల్ కి కొత్త పేరు పెట్టిన అభిమాని..

Advertisement

ఇక ఈ వేడుకకు భద్రాద్రి రామయ్య విగ్రహాలతో హాజరైన ఒక అభిమాని అఖిల్ కి కొత్త పేరు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.అయ్యగారే నెంబర్ వన్ అంటూ అక్కినేని అఖిల్ పై గతంలో ఒక అభిమాని చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారడమే కాకుండా అవి విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికీ అఖిల్ ని అయ్యగారు అంటూ అభిమానులు సరదాగా పిలుస్తుంటారు. అయితే నేడు తిరుపతిలో జరిగిన లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక అభిమాని అక్కినేని హీరో అఖిల్ కి “నాగ అఖిల్ “అని పేరు పెట్టారు.

ALSO READ:ఏమంటివి.. ఏమంటివి..అన్నగారి డైలాగుతో అదరగొట్టేసిన భాగ్యశ్రీ!

ఈ పేరులో అంత డెప్త్ ఉందా?

Advertisement

ఈ పేరుతో “నాగ లోని నాగేశ్వరరావు, నాగార్జున, అఖిల్ అ లోని అన్నపూర్ణమ్మ , అమల ఇలా ఈ పేరులో మొత్తం నలుగురు గొప్ప వ్యక్తులను చూడవచ్చు. ఇలా నలుగురు వ్యక్తులను మనం నాగ అఖిల్ లో చూస్తాము. ఇది భద్రాద్రి రామయ్య ఆన. ఇప్పటివరకు ఒక ఎత్తు అంటే ఇప్పటివరకు అఖిల్ అక్కినేని సినిమాలు ఒక ఎత్తైతే.. ఇక లెనిన్ తర్వాత నాగ అఖిల్.. ఆయన పేరు పెట్టుకున్న తర్వాత డబుల్ ఇంపాక్ట్ తో ఆయన సినిమాలు మంచి సక్సెస్ అవుతాయి. ఇక నుంచి నాగ అఖిల్ విధ్వంసం సృష్టిస్తాడు అంటూ ఆ అభిమాని చెప్పుకొచ్చారు.

అభిమాని వివరాలు ఇవే!

ఇకపోతే ఆ అభిమాని పేరు నరసింహారావు.. అనపరెడ్డిపల్లి శివాలయం చైర్మన్.. ఖమ్మం జిల్లా భద్రాచలం నుండి వచ్చాను అంటూ రాముల వారి విగ్రహాలను చేతిలో పెట్టుకొని అఖిల్ కి నాగ అఖిల్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ అభిమాని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈయన చెప్పినట్టుగానే నాగ అఖిల్ కి భవిష్యత్తులో మరిన్ని విజయాలు లభించాలని మనస్పూర్తిగా అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

ఏమంటివి.. ఏమంటివి..అన్నగారి డైలాగుతో అదరగొట్టేసిన భాగ్యశ్రీ!

” సేవ్ చేసిన రీల్స్ నిజమయ్యాయి”.. సాయి ధరమ్ తేజ్ కొత్త పోస్ట్! !

అనిల్ నీ మాస్టర్ ప్లాన్ ఏంటయ్యా?

12 ఏళ్లుగా ఆయన ఫోటోనే నా మొబైల్ వాల్ పేపర్.. అసలు విషయం చెప్పిన అఖిల్!

61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్!

ఇండస్ట్రీలో ఘోర విషాదం..లెజెండ్రీ పాండవాని సింగర్ మృతి!

Kissik Talks Show : సిద్ధు వల్ల బాగా ఏడ్చేశాను.. అదే నేను చేసిన పెద్ద తప్పు…

Big Stories

Advertisement
×