BigTV English

Tollywood Choreographers : టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ భార్యలు ఎవరో తెలుసా..?

Tollywood Choreographers : టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ భార్యలు ఎవరో తెలుసా..?

Tollywood Choreographers : ఒక మూవీ హిట్ అవ్వాలంటే సినిమా స్టోరీ ఒకటి ఉంటే సరిపోదు. ఆ సినిమాలో పాటలు అలాగే అద్భుతమైన డాన్స్ లు కూడా ఉండాలి. ఈమధ్య ఎక్కువగా డాన్స్ స్టెప్పులను బట్టి పాటను హిట్ చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఇప్పటికే చాలా పాటలు ఉన్నాయి. సినిమాలోని ప్రతి పాటకు అద్భుతమైన డాన్స్ వచ్చేలా చేసేది కొరియోగ్రాఫర్స్.. ప్రతి హీరోతో అదిరిపోయే స్టెప్పులు వేయిస్తుంటారు. అందుకే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎలాగో అలాగే కొరియోగ్రాఫర్ కూడా బ్యాక్ బోన్ లాంటివాడు అని చెప్పడంలో సందేహం లేదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు. అయితే వాళ్ల ఫ్యామిలీ గురించి కొద్దిమందికి మాత్రమే తెలిసే ఉంటుంది. ఎక్కువమంది కొరియోగ్రాఫర్లు తమ ఫ్యామిలీని పరిచయం చేసి ఉండరు. ఇప్పుడు మనం టాలీవుడ్ కొరియోగ్రాఫర్ల భార్యలు ఏం చేస్తూ ఉంటారు ఒకసారి తెలుసుకుందాం..


టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ భార్యలు ఏం చేస్తారు..? 

లారెన్స్ మాస్టర్..

తెలుగు ప్రేక్షకులకు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాదు హీరోగా, డాన్సర్ గా, ఈ మధ్య డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యారు. రాఘవ లారెన్స్ భార్య పేరు లత.. దీని గురించి చాలామందికి తెలియదు. ఈమె హౌస్ వైఫ్..

రఘు మాస్టర్..

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే అంటూ ఒక్కసారిగా ఫేమస్ అయినా కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్. ఈ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంది. ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా రఘు మాస్టర్ బాగా పాపులర్ అయ్యారు. ఈయన భార్య పేరు ప్రణవి. ఈమె టాలీవుడ్ సింగర్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.


శేఖర్ మాస్టర్.. 

ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. స్టార్ హీరోలు అందరి చేత స్టెప్పులు వేయించిన మాస్టర్ గురించి అతి కొద్ది మందికి తెలిసి ఉంటుంది. ఆయన భార్య పేరు సుజాత. హౌస్ వైఫ్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తుంది.

జానీ మాస్టర్.. 

తెలుగు తో పాటు మిగిలిన ఇండస్ట్రీలలో కూడా తన సత్తాను చాటుతున్న టాప్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ ఒకరు. ఈమధ్య ఈయన కొన్ని పర్సనల్ విషయాల వల్ల జైలుకు వెళ్లి వచ్చిన మళ్లీ బయటకు వచ్చిన తర్వాత తన కెరీర్ ని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బిజీగా గడుపుతున్న జానీ మాస్టర్ భార్య గురించి అందరికీ తెలుసు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. సుహాసిని గా ఉన్న ఈమె పేరు పెళ్లి తర్వాత ఆయేషాగా మారిపోయింది. ఈమె హౌస్ వైఫ్ గా ఉన్నారు.

ఆట సందీప్.. 

టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న వాళ్లలో ఆట సందీప్ ఒకరు. ఈయన భార్యకు పేరు జ్యోతి. ఈమె కూడా కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ కలిసి డాన్స్ స్కూల్లో ఎంతోమంది డాన్సర్స్ ని తయారు చేస్తున్నారు.

గణేష్ మాస్టర్.. 

టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న కొరియోగ్రాఫర్లలో మరో కొరియోగ్రాఫర్ పేరు గణేష్ మాస్టర్. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ హీరోలతో స్టెప్పులు వేయించిన ఘనత ఈయనదే.. ఈయన భార్య పేరు నాగమణి. ఈమె హౌస్ వైఫ్ గా ఉన్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు. తెలుగు కొరియోగ్రాఫర్లు మాత్రమే కాదు వేరే భాషల్లోని కొరియోగ్రాఫర్లు కూడా తెలుగులో స్టార్ హీరోల చేత స్టెప్పులు వేయించారు. చాలావరకు కొరియోగ్రాఫర్ల భార్యలు గృహిణులుగా కొనసాగుతున్నారు. కొంతమంది మాత్రమే తమ భర్తలతో కలిసి డాన్సర్స్ గా కొనసాగుతున్నారు.

Related News

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ మళ్లీ వాయిదా? రిలీజ్ ఎప్పుడంటే..?

Prabhas Look Raja Saab : రాజా సాబ్ నుంచి ప్రభాస్ లుక్ లీక్… ఏమున్నాడ్రా బాబు..

Deepika Padukone: నన్నే టార్గెట్ చేస్తున్నారు… కల్కి కాంట్రవర్సీపై దీపిక రియాక్షన్!

SSMB 29: స్పెషల్ సాంగ్ కోసం ఆ స్టార్ హీరోయిన్.. జక్కన్న ప్లాన్ అదుర్స్!

HBD Ali: అలీ కుటుంబం బర్మాను వదిలి రాజమండ్రిలో సెటిల్ అవ్వడానికి కారణం?

HBD Rajamouli: సినీ పరిశ్రమనే శాసించిన జక్కన్న.. రెమ్యూనరేషన్, ఆస్తులు, కార్ల జాబితా ఇదే!

Film industry: గుండెపోటుతో మరో స్టార్ హీరో మృతి.. చిన్న వయసులోనే!

Big Stories

×