SSMB 29:రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబి29’. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా ఎంపికయింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనికితోడు ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వదులుతారని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఆరోజు కేవలం మహేష్ బాబు మెడలో ఉన్న లాకెట్ ను మాత్రమే హైలెట్ చేస్తూ.. ఒక పోస్ట్ పెట్టిన జక్కన్న.. నవంబర్లో అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి అంచనాలు పెంచేశారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో స్పెషల్ సాంగ్ లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అటు రాజమౌళి కూడా తన ప్రతి సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్ ను పెడుతున్నారు. ఎవరు ఊహించని భామలను రంగంలోకి దింపుతూ ఆ పాటలతో సినిమాకే హైలెట్ గా మారుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29లో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని.. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం ఒక స్పెషల్ పర్సన్ ని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం.
ALSO READ:HBD Ali: అలీ కుటుంబం బర్మాను వదిలి రాజమండ్రిలో సెటిల్ అవ్వడానికి కారణం?
ఆమె ఎవరో కాదు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez).. ఇప్పుడు ఈమెను తన సినిమాలో తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కోసం రూపొందించే స్పెషల్ సాంగ్ లో జాక్వెలిన్ తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకి హైలైట్ గా నిలవబోతోంది అని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు తో జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ అనే మాట వినడానికి చాలా అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది జక్కన్న ప్లాన్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ సుమారుగా 1200 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. 120 దేశాలలో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ నవంబర్ 16న రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.