The Paradise Movie: టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరసగా హిట్ సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ ఏడాది హిట్ 3 ప్రేక్షకులను పలకరించాడు. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో వచ్చిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాని ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నాడు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీ గురించి జనాలు ఒక కన్ఫ్యూజన్ మొదలైంది. సినిమా విడుదల తేదీ మళ్లీ వాయిదా పడింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ మూవీ ఇది.. ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి మొదలు కాకపోవడం, షూటింగ్ కూడా స్లోగా సాగడం వల్ల మార్చి 26 రిలీజ్ డేట్ అందుకోవడం కష్టమే అనే టాక్ ఉంది. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. అయితే మొత్తానికి వచ్చేయడాది మార్చిలో ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే ఆ నెలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. మార్చి 27 న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. అయితే రెండు పెద్ద సినిమాలు కావడంతో నాని సినిమాని పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని టాక్.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం..
Also Read: రాజా సాబ్ నుంచి ప్రభాస్ లుక్ లీక్… ఏమున్నాడ్రా బాబు..
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి అంటే మూవీ లవర్స్ కి పెద్ద పండగే.. కానీ డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం టెన్షన్ మొదలవుతుంది. రెండిట్లో ఏ సినిమా హిట్ అవ్వకపోయినా సరే వాళ్లకి నష్టాలు తప్పవు. ఇప్పుడు నాని, రామ్ చరణ్ మూవీల పరిస్థితి కూడా అదే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌ను కొన్ని నెలలు వెనక్కి జరపడం నిర్మాతలకు ఒక సేఫ్టీ బ్రేక్ అవుతుంది. ఏదో హడావిడిగా వచ్చి, మరో పెద్ద సినిమాతో పోటీ పడి, కలెక్షన్లను రిస్క్‌లో పెట్టడం కంటే ఏదో ఒక సోలో డేట్ ని ఫిక్స్ చేసుకొని థియేటర్లలో కొస్తే విన్నర్ గా నిలవచ్చు. వేరే ఏ సినిమాలు లేకపోవడంతో జనాలు ఎక్కువగా ఈ సినిమాకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. రామ్ చరణ్ సినిమా ఎట్టి పరిస్థితులను వెనక్కి తగ్గే అవకాశం లేదు కాబట్టి.. నాని ది ప్యారడైజ్ నిర్మాతలు ఏదో ఒక తెలివైన నిర్ణయం తీసుకొని సైడ్ అయితే బెటర్ అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.