Film industry: గత కొన్ని రోజులుగా భాషతో సంబంధం లేకుండా చాలామంది టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు ఎంతో మంది పేరున్న నటీనటులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, దర్శకులు ఇలా ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులవుతున్నారు. ముఖ్యంగా కొంతమంది వృద్ధాప్య కారణాలతో మృతి చెందితే, మరికొంతమంది గుండెపోటు లేదా ఇతర అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడుస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక బాలీవుడ్ స్టార్ హీరో గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ విషయం తెలిసి సినీ పరిశ్రమ ఉలిక్కిపాటుకు గురవుతోంది.
వాస్తవానికి సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు ఇలా గుండెపోటుతోనే.. అతి చిన్న వయసులోనే మరణిస్తుండడం చూసి అందరూ దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ముఖ్యంగా గుండెపోటుతో మరణం అనగానే అందరికీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గుర్తుకొస్తారు. బాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతుడిగా పేరు సొంతం చేసుకున్న ఆయన అతి చిన్న వయసులోనే గుండెపోటుతో కాలం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే బాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఒక హీరో గుండెపోటుతో మరణించారని తెలిసి తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ బాడీ బిల్డర్, నటుడు వరీందర్ సింగ్ ఘుమానా (Varinder Singh ghumana) . 42 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది..ఆయన మరణం విని ఇండస్ట్రీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
ఈయన పంజాబ్ కి చెందిన వ్యక్తి.. హీరోగానే కాకుండా బాడీ బిల్డర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. 2009లో “మిస్టర్ ఇండియా” టైటిల్ సొంతం చేసుకొని “మిస్టర్ ఏషియా” పోటీలలో రెండవ స్థానం సాధించారు. ఈయన చిత్రాల విషయానికి వస్తే ‘కబడ్డీ వన్స్ అగైన్’ అనే పంజాబీ చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత రోర్: టైగర్స్ ఆఫ్ సుందర్బన్స్ , మర్జావాన్, సల్మాన్ టైగర్ 3 వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ALSO READ:Bison First Single: “తీరేనా మూగవేదన”.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ సింగిల్!