Illu Illalu Pillalu Ramaraju: బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో తీసుకుపోతున్నాయి.. ఈమధ్య కొత్తగా ప్రసారమవుతున్న కొన్ని సీరియల్స్ కేవలం కొన్ని ఎపిసోడ్లతో బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి వాటిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత భార్య భర్తలు ఎలా ఉంటారు. పిల్లలని ఎలా పెంచుతారు? కుటుంబం విలువల గురించి ఆ తండ్రి పిల్లలకి ఏ విధంగా చెబుతాడు అన్నది ఈ సీరియల్ స్టోరీ. ప్రస్తుతం సక్సెస్ఫుల్ టాక్ తో రన్ అవుతున్న సీరియల్స్లలో ఈ సీరియల్ పేరు మొదటిగా వినిపిస్తుంది. ఇందులో మెయిన్ లీడ్ రోల్ అయిన రామరాజు పాత్రలో ప్రభాకర్ నటించారు.. ఈయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గతంలో ఎన్నో సీరియల్స్ లలో నటించారు. అయితే ఈ సీరియల్కు ఈయన ఒక్క రోజుకి తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ప్రభాకర్ ఒక్కరోజుకు ఎంత తీసుకుంటాడో చూద్దాం..
బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటులలో ప్రభాకర్ ఒకరు. అప్పట్లో హీరోగా నటించిన ఈయన ఇప్పుడు సీరియల్స్లలో తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చామంతి సీరియల్ తో పాటుగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో కూడా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ప్రభాకర్ ఒక్క రోజుకి 40 వేల రెమ్యూనిరేషన్ ని అందుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై సీనియర్స్గా కొనసాగుతున్న వాళ్లలో అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఈయన ఒకరు. సీరియల్స్ షూటింగు నెలలో 20 రోజుల వరకు ఉంటుంది. ఆయన లక్షల్లోనే సంపాదిస్తున్నారు. సినిమాలో హీరోలతో పోలిస్తే సీరియల్ లోని నటించే వాళ్లకే ఎక్కువగా పారితోషకం అందుతుందన్న విషయం తెలిసిందే..
Also Read: టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ భార్యలు ఎవరో తెలుసా..?
ప్రభాకర్ 1990 నుంచి సీరియల్స్ లలో నటిస్తూ వస్తున్నారు. చాణక్య, రుతురాగాలు, అన్నా చెల్లెల్లు, ముద్దుబిడ్డ వంటి హిట్ సీరియల్స్ లలో నటించారు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్లలో నటిస్తున్న ప్రభాకర్ ను బుల్లితెర మెగాస్టార్ అని పిలుస్తారు. ఈయన ఎక్కువగా ఈటీవీ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయ్యారు. అందుకే ఈయన్ని అందరూ ఈటీవీ ప్రభాకర్ అని పిలుస్తారు. కేవలం సీరియల్స్లలో నటించడం మాత్రమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రభాకర్ జీ తెలుగులో సక్సెస్ఫుల్గా ప్రసారమవుతున్న చామంతి సీరియల్ లో నటిస్తున్నారు. అలాగే స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ప్రభాకర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన భార్య పేరు మలయజ.. ఈమె యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నారు. అలాగే ఈయనకు ఇద్దరు పిల్లలు. ఇటీవలే ప్రభాకర్ కొడుకు సుహాస్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు..