BigTV English

Deepika Padukone: నన్నే టార్గెట్ చేస్తున్నారు… కల్కి కాంట్రవర్సీపై దీపిక రియాక్షన్!

Deepika Padukone: నన్నే టార్గెట్ చేస్తున్నారు… కల్కి కాంట్రవర్సీపై దీపిక రియాక్షన్!

Deepika Padukone:దీపికా పదుకొనే (Deepika padukone).. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె తొలిసారి వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ (Ashwini Dutt)భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘కల్కి2898AD’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ఈ సినిమాలో సుమతీ పాత్రతో అద్భుతంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈ సినిమా సీక్వెల్ కల్కి2లో కూడా దీపిక నటిస్తోంది అంటూ వార్తలు రాగా.. గత నెల రోజుల క్రితం ఈ సినిమా నుండి దీపికా పదుకొనేను తప్పిస్తున్నాము అంటూ వైజయంతి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.


8 గంటల పని దినాలపై దీపిక రియాక్షన్..

దీంతో చాలామంది దీపికపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రోజుకు 8 గంటల పని దినాలు కోరడం, కల్కి చిత్రం కంటే 25% అధికంగా కల్కి2 కోసం రెమ్యూనరేషన్ అడగడం వల్లే.. ఈమెను సినిమా నుండి తప్పించారు అంటూ వార్తలు వినిపించాయి. దీనికి తోడు గతంలో ‘స్పిరిట్’ సినిమా నుండి తీసివేయడంపై సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) విషయాన్ని కూడా బయటకి తీస్తూ.. తప్పు ఈమెదే అంటూ పలు రకాల కామెంట్లు చేశారు. అయితే తాజాగా దీనిపై దీపిక ఊహించని కామెంట్లు చేసింది. ముఖ్యంగా వారి పేర్లు తీసి ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయడం తనకు ఇష్టం లేదంటూ చెబుతూనే.. అసలు విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఎన్నో ఏళ్లుగా హీరోలు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు – దీపిక

విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోనైనా.. మరెక్కడైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే అలాగే ఉండకండి. ముఖ్యంగా ఒక నటిగా నాకు ఇబ్బందిగా అనిపిస్తే.. నేను దేనిని అంగీకరించను. భారత సినీ పరిశ్రమలో ఎంతోమంది సూపర్ స్టార్స్, హీరోలు ఎన్నో సంవత్సరాలుగా 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ విషయం రహస్యం ఏమీ కాదు. కానీ అది ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు. నేను ఇప్పుడు వారి పేర్లు చెప్పి ఈ విషయాన్ని పెద్దదిగా చేయాలని అనుకోవడం లేదు. కానీ చాలామంది హీరోలు గత కొన్ని సంవత్సరాలుగా రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. అంతేకాదు సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. వీకెండ్స్ వచ్చాయంటే వాళ్ళు అసలు పనులు కూడా చేయరు” అంటూ అసలు విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.


ALSO READ:SSMB 29: స్పెషల్ సాంగ్ కోసం ఆ స్టార్ హీరోయిన్.. జక్కన్న ప్లాన్ అదుర్స్!

నిశ్శబ్దంగా పోరాటం చేస్తేనే గౌరవం – దీపికా పదుకొనే

ఇకపోతే హీరోలకే 8 గంటల పని దినాలా? హీరోయిన్లకు 8 గంటల పని దినాలు వర్తించవా? అంటూ ప్రశ్నించింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో ” న్యాయ కోసం చేస్తున్న ఈ పోరాటంలో ఇబ్బంది కలిగిందా?” అని అడగగా.. ఆమె మాట్లాడుతూ.. “ఇలాంటి ఇబ్బందులు ఇప్పుడు కొత్తేం కాదు. ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా దీని గురించి ఎలా చెప్పాలి అన్న విషయం కూడా నాకు తెలియడం లేదు. ఎన్నో పోరాటాలను నేను నిశ్శబ్దంగానే ఎదుర్కొన్నాను. కానీ కొన్ని కారణాలతో అవి బయటకు వస్తున్నాయి. సైలెంట్గా యుద్ధాలు చేయడం మాత్రమే నాకు తెలుసు.. అలా చేస్తేనే గౌరవం ఉంటుంది”అంటూ తెలిపింది దీపికా పదుకొనే. ప్రస్తుతం దీపిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

దీపికా పదుకొనే సినిమాలు..

ఇటీవల స్పిరిట్, కల్కి2 చిత్రాల నుంచి తప్పుకున్న ఈమె.. ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun), అట్లీ (Atlee) కాంబినేషన్లో రాబోతున్న సినిమాతో పాటు , షారుక్ ఖాన్ (Shahrukh Khan), సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాదు ఒక హాలీవుడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Related News

Fauji Film: ఫౌజి సినిమాకు ప్రీక్వెల్.. మా డార్లింగ్ కు కొంచమైనా గ్యాప్ ఇవ్వండయ్యా?

Kalki 2 Heroine: ‘కల్కి 2’కి హీరోయిన్‌ దొరికేసింది.. మళ్లీ బాలీవుడ్ బ్యూటీనే!

Actress Ramya: రమ్య కేస్.. 12 మంది దర్శన్ ఫాన్స్ పై ఛార్జిషీట్!

Rajamouli: ఇందుకు కదా రాజమౌళి తోపు అనేది.. బాహుబలి కోసం జక్కన్న నటన చూస్తే షాకే!

Kantara Chapter1: మొదటి వారంలోనే రూ. 500 కోట్లు.. కుమ్మి పడేస్తున్న కాంతార1!

Jr.NTR: ఎన్టీఆర్ కెరియర్ ముగిసిపోయింది.. కమల్ ఆర్ ఖాన్ పై తారక్ ఫ్యాన్స్ ఫైర్!

Mirai Closing Collections: మిరాయ్‌ క్లోజింగ్‌ కలెక్షన్స్‌… లాభం ఎన్ని కోట్లంటే!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ మళ్లీ వాయిదా? రిలీజ్ ఎప్పుడంటే..?

Big Stories

×