BigTV English

Prabhas Look Raja Saab : రాజా సాబ్ నుంచి ప్రభాస్ లుక్ లీక్… ఏమున్నాడ్రా బాబు..

Prabhas Look Raja Saab : రాజా సాబ్ నుంచి ప్రభాస్ లుక్ లీక్… ఏమున్నాడ్రా బాబు..

Raja Saab : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. డార్లింగ్ చేతిలో ఎప్పుడూ అరడజనుకు పైగా సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన ఓ మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో రాజా సాబ్ ఒకటి. ఈ మూవీ విడుదల గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని కారణాలవల్ల ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా అయిందని మేకర్స్ ఆమధ్య క్లారిటీ ఇచ్చారు. అయితే స్టార్ హీరోల సినిమాలకు లీకులు తప్పట్లేదు.. ముఖ్యంగా ప్రభాస్ సినిమాకు లీకుల బెడద ఉంటుంది. తాజాగా ఆయన నటిస్తున్న రాజా సాబ్ మూవీ నుంచి ఓ సాంగ్ లుక్ బయటకు వచ్చింది.. ప్రస్తుతం ఆ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..


రాజా సాబ్ నుంచి ప్రభాస్ లుక్ లీక్.. 

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రాజా సాబ్.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఉండడంతో ఈ సినిమా కోసం డార్లింగ్ ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ని ఎప్పుడు థియేటర్లలో చూస్తామని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. అయితే షూటింగు పెండింగ్ ఉన్న కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ మూవీలో ఫైనల్ సాంగ్ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.. ఆ సాంగ్ కు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో లీక్ అయింది.. రెడ్ టీ షర్ట్ లో ఊర మాస్ లుక్ లో కనిపించాడు ప్రభాస్. కళ్ళజోడు పెట్టుకుని, మంచి ఊపులో కనిపించాడు.. చుట్టూ ఉన్న బ్యాక్ గ్రౌండ్ ను చూస్తుంటే ఇదొక ఐటమ్ సాంగ్ అని అర్థమవుతుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ ఏమున్నాడు రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read : వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కాంట్రవర్సీ క్వీన్.. రచ్చ మాములుగా ఉండదు మరి..!


రాజా సాబ్ అప్డేట్.. 

హారర్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ అన్నీ కలగలిపిన మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. మొదట సినిమా డిసెంబర్ 5, 2024కి అనుకున్నా కూడా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాలి కాబట్టి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం పెండింగ్ షూటింగు పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమానుంచే రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా స్టోరీ ని తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇకపోతే ఈ మూవీలో మాలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. వీరి ముగ్గురితో సినిమాకు గ్లామర్ టచ్, ఫ్రెష్‌నెస్ వస్తుందని టీమ్ చెబుతోంది.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

Related News

Suniel Shetty: కన్నీళ్లు, గర్వం, గూస్‌బంప్స్‌ ఒకేసారి.. ‘కాంతార’ మూవీపై బాలీవుడ్‌ నటుడు రివ్యూ!

Fauji Film: ఫౌజి సినిమాకు ప్రీక్వెల్.. మా డార్లింగ్ కు కొంచమైనా గ్యాప్ ఇవ్వండయ్యా?

Kalki 2 Heroine: ‘కల్కి 2’కి హీరోయిన్‌ దొరికేసింది.. మళ్లీ బాలీవుడ్ బ్యూటీనే!

Actress Ramya: రమ్య కేస్.. 12 మంది దర్శన్ ఫాన్స్ పై ఛార్జిషీట్!

Rajamouli: ఇందుకు కదా రాజమౌళి తోపు అనేది.. బాహుబలి కోసం జక్కన్న నటన చూస్తే షాకే!

Kantara Chapter1: మొదటి వారంలోనే రూ. 500 కోట్లు.. కుమ్మి పడేస్తున్న కాంతార1!

Jr.NTR: ఎన్టీఆర్ కెరియర్ ముగిసిపోయింది.. కమల్ ఆర్ ఖాన్ పై తారక్ ఫ్యాన్స్ ఫైర్!

Mirai Closing Collections: మిరాయ్‌ క్లోజింగ్‌ కలెక్షన్స్‌… లాభం ఎన్ని కోట్లంటే!

Big Stories

×