Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్, భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు వినియోగ దారుల కోసం గ్రోసరీ విభాగంలో అద్భుతమైన ఆఫర్ తో మీ ముందుకు వచ్చేసింది. మొదటి నాలుగు ఆర్డర్లపై ఏకంగా 100, 200 వందలు కాదు ఏకంగా 400 రూపాయల తగ్గింపు అందిస్తోంది. కనీసం మీరు నాలుగు సార్లు సరుకులు ఆర్డర చేసిన ప్రతిసారి ఈ రాయితీ లభిస్తుంది. అంటే ఇంట్లోకి అవసరమై సరుకులు తక్కువ ధరకే పొందే అవకాశమిది.
బిజీ లైఫ్ లో మంచి ఆఫర్
ఇప్పుడు బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరూ సమయం ఆదా చేసుకోవాలని అనుకుంటారు. మార్కెట్ కి వెళ్లి గంటల తరబడి నిలబడి సరుకులు కొనడం, బరువులు మోసుకుని ట్రాఫిక్ లో నిలబడడం, బైక్ మీద తీసుకుని వెళ్లడం ఇవన్నీ ఇబ్బంది కలిగిస్తుంటాయి. అలాంటి వారి కోసం ఫ్లిప్‌కార్ట్ ఒక వరమనే చెప్పాలి. ఈ గంటల తరబడి నిలబడి సమయం వృధా అవసరం లేదంటుంది ఫ్లిప్‌కార్ట్. అలాంటి వాటన్నిటికీ గుడ్ చెప్పి కేవలం మొబైల్‌లో కొన్ని క్లిక్స్‌తోనే బియ్యం, నూనె, పప్పులు, టీ, సబ్బులు, డిటర్జెంట్, కుకింగ్ ప్రొడక్ట్స్ లాంటి వందల వస్తువులను ఇంటి గుమ్మానికి తెప్పించుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ చెబుతుంది.
ఏకంగా 1600 తగ్గింపు
అంతేకాదు.. ఆఫర్ కూడా ప్రకటించింది. దీని ద్వారా కొత్త కస్టమర్లు నాలుగు సార్లు కొనుగోలు చేసినప్పుడు ప్రతి ఆర్డర్‌పైనా తగ్గింపు లభిస్తుంది. అంటే ముందుగా చెప్పాలంటే మొదటి ఆర్డర్ రూ.1000 ఉంటే, ఆపై నేరుగా రూ.400 తగ్గింపు వస్తుంది. ఇక రెండు, మూడు, నాలుగవ ఆర్డర్‌లపై కూడా ఇదే రాయితీ వర్తిస్తుంది. దీంతో మొత్తం మీద రూ.1600 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఆఫర్లు మనకు రోజవారీ ఖర్చులను ఆదా చేస్తాయి. మనం తరచూ కొనే సరుకులు అంటే, బియ్యం, నూనె, పప్పులు, చక్కెర, టీ వంటి వాటిని ఇలాంటి ఆఫర్ సమయంలో కొంత మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పండుగల సీజన్ కాబట్టి, కుటుంబానికి అవసరమైన సరుకులు ముందుగానే తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవడం చాలా లాభదాయకం.
Also Read: Papaya Side Effects: బొప్పాయి ఎక్కువ తింటే.. శరీరంలో జరిగేదిదే ?
నాణ్యత పరంగా..
గ్రోసరీతో పాటు ఫ్లిప్‌కార్ట్ లో ప్రధాన ఆకర్షణలలో ఒకటి నాణ్యత అని చెప్పొచ్చు. టాటా టీ, ఫార్చ్యూన్, కెలాగ్స్, టైడ్, సర్ఫ్ ఎక్సెల్ వంటి టాప్ బ్రాండ్లు కూడా భారీ ఆఫర్లతో అందుబాటులో ఉంటాయి. ఇలాంటివి స్థానిక దుకాణాల్లో కొంటే ఎక్కువ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం రాయితీలు, ఆఫర్లు కలిపి మరింత తక్కువ ధరకే లభిస్తాయి. అంతేకాదు, ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీలో హౌస్‌హోల్డ్ కేర్, బేబీ ప్రొడక్ట్స్, బ్యూటీ ఐటమ్స్, కుకింగ్ సప్లైస్, బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్ ఇలా వందల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
ఆఫర్‌ను ఎలా ఉపయోగించాలి..
ఫ్లిప్‌కార్ట్ లో ముందుగా యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఏరియా పిన్‌కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తరువాత గ్రోసరీ విభాగంలోకి వెళ్లి కావలసిన వస్తువులను కార్ట్‌లో సెలెక్ట్ చేయండి. ఆతరువాత ఆర్డర్ పూర్తి చేసే సమయంలో ఆఫర్ ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది, లేకుంటేదా కొన్నిసార్లు ప్రోమో కోడ్ ఇవ్వవలసి ఉంటుంది. అనంతరం చెల్లింపు పూర్తయిన వెంటనే డెలివరీ టైమ్ మీకు చూపిస్తుంది. కొన్ని నిమిషాల్లో మీరు చేసిన ఆర్డర్ మీ ఇంటికే వస్తుంది.
ఒక చిన్న ట్విస్ట్ ఉందండోయ్.. అదేమి టంటే..
ఫ్లిప్‌కార్ట్ లో గ్రోసరీ ఆర్డ్ చేసిన వారికి కొన్ని షరతులు కూడా ఉంటాయి. ప్రతి ఆర్డర్ కు కనిష్ట విలువ ఉండవచ్చు, కొన్ని నగరాల్లోనే ఇలాంటి ఆర్డర్లు అందుబాటులో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కావున మీరు ఆఫర్ పేజీ లోని అంటే నిబంధనలు, షరతులు (Terms & Conditions) భాగం తప్పక చదవాల్సి ఉంటుంది. ఇలాంటి ఆఫర్‌ను సరిగ్గా వినియోగించుకుంటే.. మీరు కేవలం డబ్బు ఆదా చేయడమే కాకుండా మీ షాపింగ్ అనుభవాన్ని మరింత సులభంగా మార్చుకోవచ్చు.
అంతేకాదు మీ ఇంట్లో వృద్ధులు, పిల్లలతో బిజీగా ఉన్నవారికి, లేదా ఉద్యోగంలో బిజీగా ఉన్నవారికి ఈ ఆఫర్ ప్రతి ఒక్కరికీ ఈ ఆఫర్ అనేది ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు. ఇలా తక్కువ ధరకే ఇంటి గుమ్మానికి తెప్పించుకునే సౌకర్యం, పైగా ప్రతి ఆర్డర్‌కి రూ.400 తగ్గింపు ఈ కాంబినేషన్ కచ్చితంగా ఉపయోగించకోవడం మంచింది. అందుకే, ఇంకా ఆలోచించకండి. వెంటనే ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోకి వెళ్లి షాప్ నౌ బటన్‌ను నొక్కండి. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుని మీరు ఆదా చేసుకునే ప్రతి రూపాయి, మీ కుటుంబ బడ్జెట్‌కు అదనపు సహాయం చేస్తుందని మర్చి పోకండి.