Pakistan: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగమంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆ దేశం పై దాడి చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాల పేరుతో ఆఫ్ఘనిస్థాన్ రాజధాని అయినటువంటి కాబూల్ నగరంపై ఫైటర్ జెట్లతో విరుచుకు పడింది. వరుసబాంబు పేలుళ్ల శబ్ధాలతో కాబూల్ దద్దరిల్లిపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని తాలిబాన్ ప్రతినిధి ప్రకటన చేశారు. అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటన సమయంలో ఈ దాడులు జరగడంతో అనుమానాలు ఏర్పడ్డాయి. భారత్-ఆఫ్ఘనిస్థాన్‌ల స్నేహాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.