Today gold rate: బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. బంగారం ధరలు తగ్గుతది అనే ఆశ కూడా చచ్చిపోయింది. కానీ పసిడి ప్రియులకు చల్లని కబురు తెచ్చింది. ఒక్కసారిగా బంగారం ధర అమాంతం తగ్గిపోయింది. రోజుకు వేయిలలో పెరగడమే తప్ప.. తగ్గడం మాత్రం కానీ పని.. కానీ ఒక్కసారిగా వేయిలలో తగ్గింది. దీంతో పసిడి ప్రియులలో చెప్పలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఈ బంగారం ధరలు తగ్గాలని ఆశిస్తున్నారు. భవిష్యత్తులో బంగారం ధరల ఇలాగే తగ్గాలని.. పసిడి ప్రియులు కోరుతున్నారు.
నేటి పసిడి ధరలు..
గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,150 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,290 వద్ద పలుకుతోంది.. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,13,800 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,100 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,860 తగ్గింది.. ఇలాగే తగ్గితే మళ్లీ పసిడి ప్రియులు బంగారంపై మోగ్గు చూపుతారు అని చెబుతున్నారు.
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. కొన్ని నెలలుగా నేను తగ్గేదే లే అన్నట్లుగా భారీగా పెరుగుతోంది. దీంతో పసిడి ప్రియులు చాలా మదన పడుతున్నారు. బంగారం కొనాలంటేనే వణికిపోతున్నారు.. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా తగ్గడంతో పసిడి ప్రియలు అబ్బా.. ఇది కదా కావాల్సింది అనుకుంటున్నారు. కానీ బంగారం ధరలు ఇది ఇలాగే ఉంటదా..? లేదా మళ్లీ పెరుగుతదా..? అనేది ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న.. కావునా.. బంగారం కొనేవారు వెంటనే వెళ్లి కొనండి లేదంటే మళ్లీ పెరిగితే మీకే నష్టం అంటున్న బంగారు నిపుణులు..
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,22,290 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,100 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,290 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,100 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,290 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,100 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,440 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,12,200 వద్ద ఉంది.
Also Read: ఎదురెదురుగా ఢీ కొన్న బస్సులు.. స్పాట్‌లో 10 మంది
నేటి సిల్వర్ ధరలు ఇలా..
నేడు బంగారం ధరల తగ్గితే సిల్వర్ ధరలు మాత్రం అతి భారీగా పెరిగిపోయాయి.. రోజురోజుకు సిల్వర్ ఇలా పెరిగితే దీని పై కూడా మోగ్గు చూపడం తగ్గిస్తారు. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 1,77,000 కాగా.. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ.1,80,000 వద్ద కొనసాగుతుంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజీపై రూ. 3,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,70,000 వద్ద కొనసాగుతోంది.