Thaman: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుత జనరేషన్ లో స్టార్ హీరోలు అందరికీ మ్యూజిక్ అందిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ ఉంటే థియేటర్లు మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి. అయితే అలాంటి ఎస్ఎస్ తమన్ ఇప్పుడు గ్రౌండ్లో కూడా అదరగొడుతున్నాడు. తాజాగా ఉప్పల్ స్టేడియంలో అదిరిపోయే సెంచరీ తో రెచ్చిపోయాడు ఎస్ఎస్ తమన్. కేవలం 40 బంతుల్లోనే 108 పరుగులు చేసి, బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఉప్పల్ స్టేడియం నుంచి తమన్ కొట్టే, సిక్సులు తుప్పల్లో పడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read: MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్….రూ.325 కోట్లతో భారీ స్కెచ్, కాళ్లు మొక్కిన కుర్రాడు
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించడంతోపాటు క్రికెట్ అద్భుతంగా ఆడుతున్నాడు. హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( Rajiv Gandhi International Stadium) తాజాగా సెంచరీ కూడా నమోదు చేశాడు. ఎలైట్ క్రికెట్ లీగ్ లో ( Elite Cricket League 2025) భాగంగా ఈ సెంచరీ నమోదు చేసుకున్నాడు తమన్. కేవలం 40 బంతుల్లోనే 108 పరుగులు చేసి… దుమ్ము లేపాడు తమన్. ఇందులో సిక్సర్లు అలాగే బౌండరీలు కూడా ఉన్నాయి.
నిన్న ఉప్పల్ స్టేడియం వేదికగా సినీ వారియర్స్ వర్సెస్ కద్దర్ అన్నాస్ ( Cine Warriors vs Kaddar Annas ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులోనే తమన్ సెంచరీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాదు తాను సెంచరీ నమోదు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఎస్ ఎస్ తమన్ వెల్లడించారు. ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టారు. బాస్ నేను కూడా సెంచరీ చేశాను, కేవలం 40 బంతుల్లోనే 108 పరుగులు చేశాను అంటూ ట్వీట్ చేశాడు.
ఇది ఇలా ఉండగా, ఎలైట్ క్రికెట్ లీగ్ 2025 టోర్నమెంట్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో అక్టోబర్ 9 అలాగే అక్టోబర్ 10 అంటే నిన్న ఇవ్వాలా జరగనుంది. ఈ టోర్నమెంట్ లో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. కద్దర్ అన్నాస్, టీవీ రైడర్స్, సినీ హీరోస్, హైదరాబాద్ లయన్స్, ఖాకీ బుల్లెట్లు & కార్పొరేట్ మిస్సైల్స్ జట్లు ఎలైట్ క్రికెట్ లీగ్ 2025 టోర్నమెంట్ లో పాల్గొంటాయి. ఎస్ ఎస్ తమన్ అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అందరూ సినీ హీరోస్ జట్టులో ఆడుతున్నారు. కాగా 2008 సమయంలో ఇండస్ట్రీలో దూకుడు ప్రారంభించిన తమన్, ఇప్పటికీ దుమ్ములేపుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాతో కూడా సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా విజయం వెనుక తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక కారణం. ది రాజా సాబ్ కు కూడా తమనే వాయిస్తున్నాడు.
108* of 40 Balls at Our #RajivGandhiStadium 🏟️#Uppal TODAY 💪🏾❤️⚡️⚡️⚡️
Century yay 🥳 🙌🏿 https://t.co/oUrj9mkdtI
— thaman S (@MusicThaman) October 9, 2025
You know his name : @MusicThaman annas finest form continues with out of park performances ❤️
యే పట్టుకొచ్చి విచ్చుకత్తి!!
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టేనంట ప్రాణ భీతి
భయమే భయపడే !!#ECL #EliteCricketLeague 🌟#OperationSindoor #CricketForCause #Thaman #CineHeros #JaiHind 🇮🇳 pic.twitter.com/GzPtZlcKIu— ThamanFandomGroup™ (@Supremo_TFG) October 10, 2025