Gundeninda GudiGantalu Today episode November 16th: మీనా వెళ్తుండగా ఒకచోట అరుణ్ కనిపిస్తాడు. అయితే, మీనా గారు నేను మీతో మాట్లాడాలి అని ఎంతగా పిలిచినా సరే మీనా మాత్రం మొదట ఇతను ఎందుకులే మాటలు అన్నట్లుగా ఉంటుంది కానీ ఆ తర్వాత అతని రిక్వెస్ట్ చేయడంతో అతని దగ్గరికి వెళ్తుంది. మీ ఆయనకు నాకు గొడవలు ఉండవచ్చు అతనికి ఆ విషయం తప్ప ఆలోచన లేదు కానీ నేను సుమతిని సిన్సియర్గా ప్రేమించాను సుమతి కూడా నన్ను సిన్సియర్ గానే లవ్ చేసింది అని చెప్తాడు అరుణ్.. అయితే మీ ఆయన గోపిష్టి తనకి ఏం చెప్పినా కూడా అర్థం కాదు కనీసం మీరైనా మా బాధను అర్థం చేసుకోండి అని ఎంత చెప్పినా సరే నా భర్తని తక్కువ చేసి మాట్లాడితే నేను అసలు ఊరుకోను అని మీనా వార్నింగ్ ఇస్తుంది. అరుణ్ మాటలు విన్న మీనా సుమతి మీద ఆయనకు చాలా ప్రేమ ఉంది ఎలాగైనా సరే మా ఆయనను ఒప్పించి ఈ పెళ్లి దగ్గరుండి జరిగేలా చేయాలి అని అనుకుంటుంది. అటు బాలు మాత్రం మీనా తనకి చెప్పకుండా వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు.
ప్రభావతి రాత్రి అవ్వగానే బాలు బయట అటు ఇటు తిరుగుతూ కనిపిస్తాడు.. ఏంట్రా ఎవరో వాచ్మెన్ దిగినట్టు అటు ఇటు తిరుగుతున్నానండి ఏం జరిగింది అని ప్రభావతి అడుగుతుంది. కానీ బాలు మాత్రం అస్సలు సమాధానం చెప్పకుండా అటు ఇటు తిరుగుతూ కోపంగా చూస్తాడు. అయితే ఏమైంది ఎందుకు వీడు ఎంత కోపంగా ఉన్నాడు. తెలుగు అటు ఇటు తిరుగు నేను వెళ్తున్నాను అని ప్రభావతి లోపలికి వెళుతుంది. అయితే లోపలికి వెళ్లదని బాలు కాడికి ఏదో అయింది. వాడు అటు ఇటు తిరుగుతూ అక్కడే ఉన్నాడు అని సత్యంతో చెప్తుంది. ప్రభావతి ఇక సత్యం వాడు కోపంగా ఉండడని అర్థమవుతుంది. ఇంట్లోకి రాని ప్రశాంతంగా ఏమైంది కనుక్కుందామని అంటాడు. వాడు లోపలికి రానని అంటున్నాడు మీనా వచ్చిన తర్వాతే వస్తాను అని అంటున్నాడు కదా.. మరి ఏంటో కనుక్కోవచ్చు కదా అని ప్రభావతి పంపిస్తుంది.. మీనా వచ్చిన తర్వాతే వస్తాను నాన్న మీరు వెళ్ళండి అని సత్యంతో అంటాడు..
సత్యం అలా వెళ్ళగానే మీనా రాగానే ఎక్కడికి వెళ్లొచ్చావు అని మన బాలు అడుగుతాడు. పూలు ఇవ్వడానికి వెళ్లొచ్చాను ఏమైంది మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని మీనా అడుగుతుంది.. ఏంటి నిజంగానే పూలు ఇవ్వడానికి వెళ్ళావా? ఎవరికి? ఎవరికి ఎవరికి పూలు ఇవ్వడానికి వెళ్లావు మీ అమ్మకా నాకు నిజం తెలియదు అనుకుంటున్నావా ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని బాలు చాలా సీరియస్ గా మీనా పై అరుస్తాడు. నువ్వు మీ అమ్మోలింటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళావా? కొంచెమైనా నీకుందా నేను వద్దని చెప్తున్న సరే నువ్వు మాత్రం వాడితోనే పెళ్లి చేయాలని అంటున్నావు అని మీనా పై సీరియస్ అవుతాడు. అయితే ఆ మాట విన్న మీనా మనం బయట ఉన్నామండి అందరు మనల్ని చూస్తారు లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అని తనని బ్రతిమలాడే లోపలికి తీసుకొని వెళుతుంది..
ఇక రాత్రి అవగానే శృతి తన రెస్టారెంట్ ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. ఎలాగైనా సరే రవిని ఆ రెస్టారెంట్ నుంచి బయటకు తీసుకురావాలి కచ్చితంగా తనని ఒక రెస్టారెంట్ కి ఓనర్ని చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే రవి రాగానే ఎంతవరకు వచ్చింది రెస్టారెంట్ పనులు రెస్టారెంట్ పూర్తయిందా లేదా అని వెటకారంగా మాట్లాడతాడు. ఆ మాట వినగానే.. శృతి ఏంటి నేను రెస్టారెంట్ పెట్టలేను నువ్వు అనుకుంటున్నావా? డబ్బులు ఉంటే రెస్టారెంట్ ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పగానే రవి కున్న నాలెడ్జ్ గురించి బయట పెట్టేస్తాడు రెస్టారెంట్ పెట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా దానికి ఎంత ప్రాసెస్ ఉందో నీకు తెలుసా అని మొత్తం చెప్పగానే శృతి నోరు వెళ్ళబెట్టి వింటూ ఉంటుంది. అటు మనోజ్ ను ఎలాగైనా సరే టెన్షన్ పడేలా చేయాలని రోహిణి కావాలనే తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు నడుస్తుంది అది విన్న మనోజ్ నిజంగానే రోహిణి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అంటూ భయపడి పోయి బాత్రూం నుంచి బయటకు వచ్చేస్తాడు.
తర్వాత రోజు మీనా బాలు వెళ్తూ ఉండగా ఎదురుగా అరుణ్ అటుగా వస్తాడు. అయితే అరుణ్ అడ్డు తప్పుకోడు. అలాగే బాలు కూడా అటు తప్పుకోడు. తనరు ఇద్దరు బయటికి ఒకరినొకరు గొడవపడే వరకు తీసుకుని వస్తారు. మీనా ఎందుకండి గొడవ మనం వెళ్ళిపోదాం పదండి అని ఎంతగా చెబుతున్నా సరే అరుణ్ కూడా తగ్గడు అలాగే బాలు కూడా తగ్గరు. ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్తారు. అయితే అక్కడే ట్రాఫిక్ లో ఆటోలో కూర్చుని ఉన్న సుమతి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని బయటకు వస్తుంది. అది చూసిన సుమతి వాళ్ళిద్దరు గొడవను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదంతా చూస్తూ ఉన్న సుమతి మాత్రం వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ బాలు మాత్రం నేను అస్సలు తగ్గను అని అంటాడు.. సుమతి మాట విన్న అరుణ్ పక్కకి తప్పుకోవాలని అనుకుంటాడు. అది చూసిన బాలు మౌనంగా ఉండిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :Podarillu Today Episode : మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. కన్నాను కాపాడిన నారాయణ.. చక్రికీ షాక్..