E-Paper
Advertisement

Don 3 Controversy: రణవీర్ సింగ్ నుంచి రూ.40 కోట్ల నష్టపరిహారం కోరుతున్న నిర్మాతలు…!

Don 3 Controversy: రణవీర్ సింగ్ నుంచి రూ.40 కోట్ల నష్టపరిహారం కోరుతున్న నిర్మాతలు…!
Advertisement

Don 3 Controversy:  బాలీవుడ్‌లో ప్రస్తుతం డాన్ 3 సినిమా వివాదం తెగ వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాలో హీరోగా ఎంపికైన రణవీర్ సింగ్ అకస్మాత్తుగా సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సమస్య మొదలైంది. ఈ విషయంలో ఇప్పుడు రూ.40 కోట్ల నష్టపరిహారం అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాను ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ‌‌ ఆయన భాగస్వామిగా ఉన్న ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. అయితే కథ, పాత్ర డిజైన్ విషయంలో తనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని రణవీర్ సింగ్ భావించినట్లు సమాచారం. అదే కారణంతో తాను ఈ సినిమా నుంచి తప్పుకున్నానని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

నిర్మాతల వాదన మాత్రం భిన్నం..!

Advertisement

కానీ నిర్మాతల వాదన మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. రణవీర్ సింగ్ మధ్యలోనే సినిమా వదిలేయడం వల్ల ప్రాజెక్ట్‌కు భారీ నష్టం వచ్చిందని వారు అంటున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్, ఇతర ఏర్పాట్లపై చాలా ఖర్చు అయిందని, అందుకే రూ.40 కోట్ల నష్టపరిహారం కోరుతున్నామని సమాచారం. ఈ విషయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.

కోర్టుకు వెళ్లక తప్పదు..!

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు పక్షాలు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించాయి. అక్కడ చర్చలు జరిగినా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. చివరికి చట్టపరమైన మార్గంలో ముందుకు వెళ్లాలని గిల్డ్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదం కోర్టు వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉండగా, రణవీర్ సింగ్ స్థానంలో మరో స్టార్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్ పేరు చర్చలోకి రావడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, రణవీర్ సింగ్ మరియు ఫర్హాన్ అక్తర్ మధ్య గతంలో మంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి దిల్ ధడక్‌నే దో, అలాగే గల్లీ బాయ్ వంటి సినిమాల్లో పనిచేశారు. అలాంటి ఇద్దరి మధ్య ఈ స్థాయి వివాదం రావడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ నేపథ్యంలో డాన్ 3..సినిమా వివాదం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. చివరికి ఈ వివాదం ఎలా ముగుస్తుంది? రణవీర్ సింగ్ నష్టపరిహారం చెల్లిస్తారా? లేక నిర్మాతలు కోర్టును ఆశ్రయిస్తారా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

ALSO READ: Vijay Rashmika: విజయ్–రష్మిక పెళ్లి చేసుకుంటున్న రిసార్ట్‌లో.. ఒక రోజు ఉండాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Related News

ఇరుముడి దెబ్బకు శివ నిర్వాణ రేంజ్ మారిపోయిందా.. ఏకంగా చిరంజీవితో?

వేల కోట్ల స్కామ్.. ఇప్పుడు పూట గడవడం లేదు.. ఆర్థిక కష్టాల్లో ఐబొమ్మ రవి!

లండన్ లో జంటగా త్రిష విజయ్..త్రిష స్థానంలో నేనుంటే ఆ పని చేయను.. నటి ఫైర్!

శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్ ‘ టీజర్ రిలీజ్!

10 ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కిన నటి అహానా కృష్ణ.. వరుడు ఎవరంటే?

చిన్నారి మృతి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి పూర్ణ!

Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. ఇది అస్సలు ఊహించలేదు మావా..!

సాయి పల్లవి కోసం.. ‘రామాయణ్’ సాంగ్‌లో ఆ నటిని బ్లర్ చేశారా?

Big Stories

Advertisement
×