Nara Lokesh: ఏపీ ఆక్వా రైతులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆస్ట్రేలియా అధికారులతో నిర్వహించిన చర్చల ఫలితంగా, రొయ్యల దిగుమతులకు మళ్లీ అనుమతి లభించింది.
లోకేష్ ఈ విషయాన్ని తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారతీయ రొయ్యల దిగుమతులకు ఆస్ట్రేలియా మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2027 అక్టోబర్ 20 వరకు ఈ అనుమతి కొనసాగుతుంది అని తెలిపారు. ఆయన ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ విభాగం నుంచి వచ్చిన అధికారిక అంగీకార పత్రాన్ని కూడా తన ట్వీట్‌కు జత చేశారు.
2016లో భారతీయ రొయ్యల్లో వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ (WSSV) ఆనవాళ్లు గుర్తించడంతో.. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతదేశం నుంచి రొయ్యల దిగుమతులను నిషేధించింది. దీనివల్ల ఏపీ రైతులు భారీగా నష్టపోయారు. ఆస్ట్రేలియా మార్కెట్ రొయ్యల ఎగుమతుల్లో ప్రాధాన్యమైన గమ్యస్థానం కావడంతో, ఈ నిషేధం రాష్ట్ర ఆక్వా రంగానికి దెబ్బతీసింది.
ఇటీవల మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా అధికారులతో చర్చలు జరిపారు. రొయ్యల నాణ్యత, హైజీన్ ప్రమాణాలు, బయోసెక్యూరిటీ చర్యలపై భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. భారతీయ ఆక్వా పరిశ్రమ ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదని, రొయ్యలలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. రొయ్యల ఎగుమతులు ఒకే మార్కెట్ పై ఆధారపడకూడదు. అమెరికా, చైనా మార్కెట్లకు మాత్రమే పరిమితం కాకుండా, కొత్త దేశాల్లో అవకాశాలను అన్వేషించాలి అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, భారత్ ఆక్వా రంగం మరింత విస్తరించగలదని ఆయన లోకేష్ తెలిపారు.
Also Read: నెల్లూరులో ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రయాణికులంతా..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆక్వా రంగంలో నాణ్యత నియంత్రణ, ఎగుమతి ప్రోత్సాహం కోసం ప్రత్యేక విధానాలను రూపొందిస్తోంది. రొయ్యల నాణ్యతపై కంట్రోల్ లాబ్‌లు, రైతులకు సబ్సిడీతో ఫీడ్ సదుపాయాలు వంటి చర్యలను తీసుకుంటోంది.
ఏపీ ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేష్..
ఆస్ట్రేలియా అధికారులతో చర్చించి రొయ్యల దిగుమతులకు ఒప్పించినట్లు ట్వీట్ చేసిన లోకేష్
ఒకే మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడకుండా కొత్త మార్కెట్ లను తెరవడం కొనసాగించాలన్న లోకేష్
2027 అక్టోబర్ 20 వరకూ భారతీయ రొయ్యల ఎగుమతులకు… pic.twitter.com/UuwKmermsm
— BIG TV Breaking News (@bigtvtelugu) October 21, 2025