Thamma Movie Review : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందనకి ఇప్పుడు గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది. ఆమె పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన సినిమాలు అన్నీ దాదాపు హిట్లే. ఈ దీపావళి పండక్కి ‘థామా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి…
స్వతహాగా జర్నలిస్ట్ అయినటువంటి అలోక్ గోయల్..కు(ఆయుష్మాన్ ఖురానా) రిస్కీ కవరేజ్లు అంటే ఇంట్రెస్ట్. అందుకే ఒక రోజు పర్వత ప్రాంతాలకు స్నేహితులతో కలిసి వెళ్తాడు. ఈ క్రమంలో అతనిపై ఓ ఎలుగుబంటి దాడి చేస్తుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న అతన్ని తడ్కా(రష్మిక మందన) అనే బేతాళ యువతి కాపాడుతుంది.
మరోపక్క పక్క మనుషుల రక్తాన్ని తాగితే శక్తులు లభిస్తాయని భావించే క్రూరమైన జాతికి చెందిన వ్యక్తి ధామా అలియాస్ యాక్షసన్(నవాజుద్దీన్ సిద్ధికీ). ఇతన్ని బేతాళ జాతి చాలా కాలంగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది. ఇలాంటి టైంలో అలోక్ ను బేతాళ జాతికి అప్పగించి అతన్ని శిక్షించాలని యాక్షసన్ ప్రయత్నిస్తాడు.
అతని భారి నుండి అలోక్ ను తెప్పిస్తుంది తడ్కా. ఆ తర్వాత తడ్కాతో ప్రేమలో పడతాడు అలోక్. అయితే ఆమె బేతాళ జాతికి చెందిన అమ్మాయి అని తెలిసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? యాక్షసన్ వల్ల వీరికి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు అతను గుహలో ఎందుకు బందీగా ఉండాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.
హారర్ సినిమాలకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. వరల్డ్ బిల్డింగ్ కరెక్ట్ గా ఉండి.. వాటిలో భాగంగా హారర్ ఎలిమెంట్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటే చాలు బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేయడం కామన్. బాలీవుడ్లో హారర్ జోనర్ సినిమాలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. కాకపోతే ఇప్పుడు అక్కడి ఫిలిం మేకర్స్ కి ఉన్న పెద్ద ఛాలెంజ్ అంటే వి.ఎఫ్.ఎక్స్ అనే చెప్పాలి. వి.ఎఫ్.ఎక్స్ క్వాలిటీ బాగుండేలా చూసుకోవడంలో అక్కడి మేకర్స్ తడబడుతున్నారు. కానీ ‘థామా’ విషయంలో దర్శకుడు ఆధిత్య సర్పోదర్ చాలా జాగ్రత్త వహించాడు.
ఈ సినిమా కథ అర్ధం కావాలంటే ప్రేక్షకులు కచ్చితంగా ‘భేడియా’ ‘స్త్రీ2’ ‘ముంజ్యా’ వంటి సినిమాలు చూసి రావాలి అనే కండిషన్ నామ మాత్రంగా పెట్టినప్పటికీ.. తెలుగులో ఎప్పుడో వచ్చిన హర్రర్ సినిమాలను కనుక చూస్తే.. ధామా ఏమాత్రం కొత్తగా ఉండదు. ఇందులో లవ్ ట్రాక్ తేలిపోయింది. ఫస్ట్ హాఫ్ అలా పాస్ అయ్యింది.
కానీ సెకండాఫ్ లో బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ బ్లాక్స్, ట్విస్ట్స్ వచ్చి పడతాయి. అందువల్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. దీంతో ‘థామా’ పాస్ మార్కులతో బయటపడుతుంది. టెక్నికల్ గా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ వంటివి బాగున్నాయి. ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అవి సరిపోతాయి అనే చెప్పాలి.
నటీనటుల విషయానికి వస్తే.. రష్మిక మరో పాత్ బ్రేకింగ్ రోల్ చేసింది. బేతాళ యువతిగా ఆమె నటన సంగతి ఎలా ఉన్నా.. యాక్షన్ ఎపిసోడ్స్, ముద్దు సీన్లు, గ్లామర్ తో ఫుల్ మర్క్స్ వేయించుకుంటుంది. ఆయుష్మాన్ ఖురానా ఎప్పటిలానే తన డీసెంట్ పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. నవాజుద్దీన్ సిద్దిఖీ తన నటనతో మ్యాజిక్ చేసింది ఏమీ లేదు.. కానీ అతని మేకోవర్ బాగుంది. వరుణ్ ధావన్ కామియో సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది.
రష్మిక గ్లామర్
యాక్షన్ ఎపిసోడ్స్
సెకండాఫ్
నిర్మాణ విలువలు
థ్రిల్లింగ్ అండ్ హారర్ ఎలిమెంట్స్ లేకపోవడం
మొత్తంగా.. ‘థామా’ రెగ్యులర్ హర్రర్ టచ్ ఉన్న సినిమానే అయినప్పటికీ.. ఈ పండక్కి ఒకసారి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఉంది.