చాలా మంది న్యూ ఇయర్ వేడుకలను క్రేజీగా నిర్వహించానుకుంటారు. కొత్త సంవత్సరం రోజు ఎంత హ్యాపీగా ఉంటే.. ఆ ఏడాది అంతా అంతే హ్యాపీగా ఉంటారని భావిస్తారు. అందుకే, ఆ రోజు కుటుంబంతో లేదంటే ఫ్రెండ్స్ తో కలిసి సంతోషకరంగా వేడుకలను జరుపుకుంటారు. మరికొంత మంది ఆయా టూరిస్ట్ ప్లేస్ లకు వెళ్లి అక్కడి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలాంటి వారి కోసం IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త సంవత్సరం వేళ రాజస్థాన్ లో తమ టైమ్ స్పెండ్ చేసేలా ఈ ప్యాకేజీని రూపొందించింది. మొత్తం 6 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రకు ‘పధారో రాజస్థాన్’ అనే పేరు పెట్టింది. ఇంతకీ ఈ టూర్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ఏ ప్రాంతాల్లో కొనసాగుతుంది? ప్యాకేజీ ధర ఎంత? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
IRCTC టూర్ ప్యాకేజీకి ‘పధారో రాజస్థాన్’ అనే పేరు పెట్టింది. ఈ వెకేషన్ 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. IRCTC ప్రకారం.. ఈ ట్రిప్ కు 150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీ ధర రూ. 50,855 నుంచి ప్రారంభం అవుతుంది. ఆయా సౌకర్యాలను బట్టి కాస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ యాత్ర జనవరి 24, 2026న ప్రారంభమవుతుంది. ఈ టూర్ లో భాగంగా పర్యాటకులు భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలులో ప్రయాణం చేస్తారు.
IRCTC తీసుకొచ్చిన ‘పధారో రాజస్థాన్’ టూర్ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులు పలు కీలక ప్రాంతాలను చూసే అవకాశం కల్పిస్తున్నారు. అందులో జైపూర్‌లో, చోఖి ధని, అమెర్ ఫోర్ట్, జల్ మహల్, హవా మహల్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్, బాపు బజార్ లాంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. జైసల్మేర్ లో హవేలీలు, ఇసుక దిబ్బలు, గడిసర్ సరస్సు, జైసల్మేర్ కోట, జైన దేవాలయాలు, యుద్ధ మ్యూజియాలను అందాలను చూసే అవకాశం ఉంటుంది. జోధ్ పూర్ లో, ఉమైద్ భవన్ ప్యాలెస్, మ్యూజియం, మెహ్రాన్ గఢ్ ఫోర్ట్, జస్వంత్ థాడా ఉన్నాయి.
Read Also: వైజాగ్ కు ప్రత్యేక రైలు, దీపావళి వేళ ప్రయాణీకులకు గుడ్ న్యూస్!
సో, ఇంకెందుకు ఆలస్యం, కొత్త సంవత్సరంలో కొత్తగా ఉండే ఈ ఐకానిక్ అడ్వెంచర్ టూర్ ప్యాకేజీని ఈరోజే బుక్ చేసుకోండి. రైల్వే అధికారిక వెబ్ సైట్ తో పాటు రైల్వే స్టేషన్లలోని బుకింగ్ సెంటర్లు, రైల్వే టిక్కెట్ ఏజెంట్ల దగ్గర టిక్కెట్ బుకింగ్ అవకాశం కల్పిస్తున్నారు. పరిమిత టికెట్లు ఉన్న నేపథ్యంలో పర్యాటకులు వెంటనే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
Read Also: మరో ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించిన IRCTC, ‘పవిత్ర కాశీ’ ప్యాకేజీ పేరుతో 4 పుణ్యక్షేత్రాల దర్శనం!