Kishkindhapuri Vs Mirai : తెలుగు ప్రేక్షకులకు శుక్రవారం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లు కళకళలాడుతాయి. అదే సినిమా రిసల్ట్ తేడా కొడితే థియేటర్లో బోసిపోతాయి. ప్రతివారం ఎన్నో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలవుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాలలో పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలవుతాయి. ఇంకొన్ని సందర్భాలలో పెద్ద సినిమాలు తో పాటు చిన్న సినిమాలు కూడా విడుదలవుతాయి.
ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ నటిస్తున్న మిరాయి సినిమా సెప్టెంబర్ 12 విడుదల కానుంది. మొదటి ఈ సినిమాను సెప్టెంబర్ ఐదున విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమాను సెప్టెంబర్ 12 కి వాయిదా వేశారు. అలానే అందరికంటే ముందు సెప్టెంబర్ 12న బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న కిష్కిందపురి సినిమా కూడా విడుదలవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ రెండు సినిమాలు మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు కూడా వీడియో కంటెంట్స్ తో సినిమా మీద విపరీతమైన అంచనాలను కూడా పెంచాయి. ఒక తరుణంలో కిస్కిందపురి సినిమా వెనక్కి వెళ్తుంది అని అనుకున్నారు. అనుకోకుండా ఒక పోస్టర్ కూడా బయటికి వచ్చింది. కానీ తగ్గేదే లే అంటూ సెప్టెంబర్ 12న వస్తున్నట్లు మళ్లీ కన్ఫర్మ్ చేశారు.
కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న సినిమా కిష్కిందపురి. ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా రెండు గంటల ఐదు నిమిషాలు ఉంటుంది. డ్యూరేషన్ పరంగా చూసుకుంటే పెద్ద రిస్క్ ఏం లేదు. సినిమా కొంచెం ఆసక్తికరంగా ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సేఫ్ అయిపోయినట్లే.
హనుమాన్ సినిమాతో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు తేజ. చాలా పెద్ద సినిమాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇక మిరాయి సినిమాకి సంబంధించి టీజర్ ట్రైలర్ కూడా విపరీతమైన అంచనాలు పెంచాయి. ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ వచ్చింది. పిల్లలు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమా డ్యూరేషన్ రెండు గంటలు 49 నిమిషాలు. అంటే దాదాపుగా పది నిమిషాలు తక్కువ మూడు గంటలు. సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటే గానీ అంతసేపు జనాలు థియేటర్లో కూర్చోలేరు. ఇక ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో సెప్టెంబర్ 12న తెలియనుంది.
Also Read : Ilayaraja: ఇళయరాజాకు మద్దతుగా మద్రాస్ హైకోర్టు, అయినా ఈ ఏజ్ లో చాదస్తం ఏంటండీ?