OTT Movie : ఒక చిన్న అమెరికన్ టౌన్ లో ఒంటరిగా ఉండే ఒక యువకుడు, ఒక బొమ్మతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. ఆతరువాత ఈ సినిమా కామెడీ సన్నివేశాలతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని, అనేక అవార్డులకు నామినేషన్లు పొందింది. నటుడు ర్యాన్ గోస్లింగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌కు నామినేట్ అయ్యాడు. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ టాప్ 10 ఫిల్మ్స్‌లో ఈ సినిమా చోటు సంపాదించింది. సాటెలైట్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్క్రీన్‌ప్లే, హ్యూమన్ రైట్స్ అవార్డ్‌కు నామినేషన్లు వచ్చాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
లార్స్ లిండ్‌స్ట్రోమ్ అనే 27 ఏళ్ల యువకుడు, విస్కాన్సిన్‌లోని ఒక చిన్న టౌన్‌లో ఒంటరిగా జీవిస్తుంటాడు. అతను సామాజికంగా ఒక ఇంట్రోవర్ట్. ఎవరితోనూ కలవడానికి ఇష్టపడడు. తన అన్నయ్య గస్, గస్ భార్య కరిన్ తో కూడా ఎక్కువగా కనెక్ట్ కాడు. లార్స్ తన గ్యారేజ్‌లో ఒంటరిగా జీవిస్తూ, అతని కొలీగ్ మార్గో ప్రేమను కూడా తిరస్కరిస్తాడు. ఒక రోజు అతను ఇంటర్నెట్‌లో ‘బియాంకా’ డాల్‌ను కొనుగోలు చేస్తాడు. ఆమెను నిజమైన స్త్రీగా భావించి, ఆమెతో సంబంధం స్టార్ట్ చేస్తాడు. లార్స్ బియాంకాను తన గర్ల్‌ఫ్రెండ్‌గా కరిన్, గస్‌కు పరిచయం చేస్తాడు. ఇది చూసివాళ్ళు షాక్ అవుతారు. కానీ అతని మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లార్స్ బియాంకాను నిజమైన వ్యక్తిగా ట్రీట్ చేస్తూ, ఆమెకు బ్యాక్‌స్టోరీ సృష్టిస్తాడు. ఆమెతో డేట్స్‌కు వెళ్తాడు.
చర్చ్ కి కూడ తీసుకెళ్తాడు. కరిన్, గస్ కలసి లార్స్‌ను సైకాలజిస్ట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్తారు. డాక్టర్ లార్స్‌కు డిలూషనల్ డిసార్డర్ ఉందని గుర్తిస్తుంది. కానీ బియాంకాను నిజమైన వ్యక్తిగా ట్రీట్ చేయమని కమ్యూనిటీని ఒప్పిస్తుంది. లార్స్‌ను హీల్ చేయడానికి అదొక్కటే మార్గమని చెప్తుంది. ఇక కాలనీ ప్రజలు బియాంకాకు జాబ్ ఇస్తారు. ఆమెను సోషల్ ఈవెంట్స్‌లో ఇన్వాల్వ్ చేస్తారు, లార్స్‌కు సపోర్ట్ చేస్తారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, లార్స్ బియాంకాతో ఉన్న సంబంధం ద్వారా తన ఒంటరితనాన్ని అధిగమిస్తాడు. ఇక క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఇక్కడ బియాంకా చనిపోతుంది. ఈ బొమ్మ ఎలా చనిపోతుంది ? ఆతరువాత లార్స్ ఎలా రియాక్ట్ అవుతాడు ? లార్స్ సమాజంలో మనుగడ సాగిస్తాడా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
“లార్స్ అండ్ ది రియల్ గర్ల్” (Lars and the real girl) క్రెయిగ్ గిలెస్పీ దర్శకత్వంలో వచ్చిన అమెరికన్ కెనడియన్ కామెడీ డ్రామా సినిమా. ఇందులో ర్యాన్ గోస్లింగ్, ఎమిలీ మోర్టిమర్, పాల్ ష్నైడర్, పాట్రిసియా క్లార్క్‌సన్, కెల్లీ గార్నర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ట్యూబీ, ప్లూటో టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 46 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 7.3/10 రేటింగ్ పొందింది.
Read Also : పోలీస్ వ్యవస్థపై పగతో హత్యలు… శవాల దగ్గర కవితలు వదిలేసి హింట్ ఇచ్చే సీరియల్ కిల్లర్… ప్రతీ సీన్ క్లైమాక్స్