E-Paper
Advertisement

Sonu Sood: షాకింగ్… నటుడు సోనూసూద్ ఆస్తులు జప్తు..

Sonu Sood: షాకింగ్… నటుడు సోనూసూద్ ఆస్తులు జప్తు..
Advertisement

Sonu Sood: ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి నిత్యం ఏదోక వార్త వినిపిస్తూనే ఉంది.. గత కొన్నినెలల క్రితం బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు.. రోజు రోజుకు ఈ యాప్స్ వల్ల ప్రాణాలను విడిచేవారి సంఖ్య పెరగడంతో పోలీసులు కన్నెర్ర చేశారు. దాంతో పాటుగా పలు కేసులు నమోదు కావడంతో విచారణ చేపట్టారు.. దీన్ని ఎలాగైన సరే కూకటి వేర్లతో నిర్మూలించాలని ఫిక్స్ అయ్యారు.. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడి కూడా రంగ ప్రవేశం చేయడంతో ఈ కేసును మరింత వేగంగా ముందుకు నడిపారు.. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు సైతం నోటీసులు పంపి వివరణ ఇవ్వాలని కోరారు. అంతటితో ఆగని ఈడీ ఆఫీసర్లు  సెలబ్రిటీల ఆస్తులను జప్తు చేసే పనిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తుంది.. ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరెవరు ఆస్తులను కోల్పోయారో ఒకసారి తెలుసుకుందాం..

సెలబ్రిటీల నుంచి కోట్ల ఆస్తులు జప్తు..

బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి చాలామంది సెలబ్రిటీలు, క్రికెటర్లు సైతం బాగా ఆస్తులు కూడబెట్టినట్లు గతంలో వార్తలు వినిపించాయి.. వారికి నోటీసులు పంపించిన ఈ డి విచారణకు హాజరుకావాలని కోరారు.. యాప్స్ గురించి వివరణ ఇచ్చిన తర్వాత వారి ఆస్తులను జప్తు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.. అయితే ఈ యాప్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేసిన వారిలో యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, ఉర్వశిరౌతేలా, సోనూసూద్, మిమీ చక్రవర్తి, అంకుష్హజ్రా, నేహా శర్మలు ఉన్నారు.. వీళ్ల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేసినట్లు తెలుస్తుంది.

ఎవరి ఆస్తులు ఎన్ని కోట్లంటే..

Advertisement

బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిన డబ్బులను ఈడీ అటాచ్ చేసింది.. అందులో సోనూసూద్  1 కోటి, యువరాజ్ సింగ్ 2.5 కోట్లు, రాబిన్ ఉతప్ప 8.26 లక్షలు, ఉర్వశిరౌతేలా 2.02 కోట్లు,. మిమీ చక్రవర్తి 59 లక్షలు, అంకుష్హజ్రా  47.20 లక్షలు, నేహా శర్మ 1.26 కోట్లు ఉన్నాయి.. మొత్తం సెలబ్రిటీల దగ్గర నుంచి దాదాపు 20 కోట్ల వరకు ఈడి ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తుంది.. వీటి వివరాలు గురించి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.. ఎంతోమంది ప్రజలకు సేవ చేస్తూ అభిమానుల మన్ననలు అందుకున్న సోనూసూద్ కూడా ఇలాంటి వాటిలో ఇరుక్కోవడంపై ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు.. ఇలాంటివి ఇక ముందు చెయ్యొద్దు అంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ లు పెడుతున్నట్లు సమాచారం.

Also Read :కన్నతండ్రి గురించి నిజం చెప్పేసిన అవని.. దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి.. మీనాక్షి ఎక్కడ..?

ఈ యాప్స్ విషయానికొస్తే..

Advertisement

ఆన్లైన్ గేమింగ్ యాప్స్ జనాలని ఎంతగా ప్రభావితం చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ యాప్ లను ప్రమోట్ చేయడంతో వారిని గుడ్డిగా నమ్మి జనాలు పెట్టుబడులు పెట్టి దారుణంగా మోసపోయారు. దాంతో ఎంతో మంది ప్రాణాలు పోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బెట్టింగ్ ల ద్వారా వచ్చిన చెల్లింపులు నేరుగా భారత్ లో కాకుండా, అసలు మూలాన్ని దాచిపెట్టడానికి విదేశీ మార్గాలకు మార్చారు.. అలా డబ్బులను దాచుకున్న 6000 అకౌంట్లను గుర్తించి వాటిని అధికారులు సీజ్ చేశారు. అలాగే 60 బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ బ్లాక్ చేసింది..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×