Mucherla Aruna: ‘సీతాకోకచిలుక’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ప్రముఖ సీనియర్ నటి ముచ్చెర్ల అరుణ(Mucherla Aruna). ఈమె ఇంట్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. అరుణ భర్త మోహన్ గుప్తా (Mohan Gupta) ప్రముఖ పారిశ్రామికవేత్త అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను నడుపుతున్నారు. ముఖ్యంగా మోహన్ గుప్తా నడుపుతున్న ఈ సంస్థలో ఈ మధ్యకాలంలో అక్రమ నగదు బట్వాడాలు అధిక స్థాయిలో జరిగాయి అని, ఫిర్యాదులు రావడంతోనే ఇప్పుడు ఈడీ అధికారులు దాడి చేసినట్లు సమాచారం.
ముచ్చెర్ల అరుణ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు..
తాజాగా చెన్నై నీలాంగరై లోని వారి ఇంట్లో , అలాగే కార్యాలయాల్లో బుధవారం ఉదయం ఒకేసారి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే భర్త కారణంగా ముచ్చెర్ల అరుణ కూడా ఇప్పుడు వార్తల్లో నిలిచిందని చెప్పవచ్చు.
ముచ్చెర్ల అరుణ సినిమా జీవితం..
ముచ్చెర్ల అరుణ సినిమా జీవిత విషయానికి వస్తే.. భారతీయ సినీ నటిగా పేరు సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించిన ఈమె.. 10సంవత్సరాల కుపైగా సినీ కెరియర్లో సుమారు 70 చిత్రాలకు పైగా నటించింది. సీతాకోకచిలుక అనే సినిమాతో 1981లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమా ఉత్తమ జాతీయ చిత్రంగా బంగారు నెమలి పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత జే గంటలు, జస్టిస్ చౌదరి, అడవి సింహాలు, రావు గోపాలరావు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 70కి పైగా చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
ముచ్చెర్ల అరుణ వ్యక్తిగత జీవితం..
1965 సెప్టెంబర్ 13న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జన్మించింది.. హైదరాబాదులో చదువు పూర్తి చేసింది. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఆఫీసర్గా పనిచేసి.. మళ్లీ వ్యవసాయం మొదలుపెట్టారు. ఈమెకు ఒక సోదరుడు, సోదరి కూడా ఉన్నారు. సినిమాలలో నటిస్తున్నప్పుడే 1987లో ప్రముఖ బిజినెస్ మాన్ మోహన్ గుప్తాను వివాహం చేసుకుంది. వీరికి నలుగురు కూతుర్లు. శిఖా, యస్వీ, శోభిక, రియా.. అరుణ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ మధ్య మరింత గుర్తింపును సొంతం చేసుకుంది.
సోషల్ మీడియా ద్వారా భారీ గుర్తింపు..
ఒకరకంగా చెప్పాలి అంటే ఈమెకు సెపరేట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతిరోజు కుకింగ్ వీడియోలతో పాటు ఇంటికి కావలసిన వంటింటి చిట్కాలను కూడా లేడీ ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అటు సోషల్ మీడియా ద్వారా కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అరుణ ఇంట్లో ఇప్పుడు ఈడి అధికారులు సోదాలు నిర్వహించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అరుణ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==