BigTV English
Advertisement

Indian Cricketers Cars: టీమిండియా ప్లేయర్ల కార్లు చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే.. ఎవరిది ఎక్కువ ధర అంటే

Indian Cricketers Cars: టీమిండియా ప్లేయర్ల కార్లు చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే.. ఎవరిది ఎక్కువ ధర అంటే

Indian Cricketers Cars: మన దేశంలో క్రికెట్ గురించి, క్రికెటర్లకు సంబంధించిన రికార్డులు, రివార్డుల గురించి తెలుసుకునేందుకు క్రీడాభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అయితే ఈమధ్య వారి గ్యారేజ్ లో ఉన్న కార్ల గురించి తెలుసుకోవడానికి కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా క్రికెటర్ల దృష్టి లగ్జరీ కార్ల పైనే ఉంటుంది. లగ్జరీ జీవితానికి అలవాటు పడిన క్రికెటర్లు.. కోట్లు పెట్టి బంగ్లాలు కొనడం మాత్రమే కాకుండా.. అవే కోట్లు కార్లకు కూడా వెచ్చిస్తున్నారు. మనదేశంలో ఉన్న బడా వ్యాపారవేత్తలు, టాప్ కంపెనీల సీఈవోలుకు ఏమాత్రం తక్కువ కాకుండా ఏడాదికి వందల కోట్లు సంపాదించే క్రికెటర్లు మన దగ్గర ఉన్నారు.


Also Read: Gukesh Dommaraju: గుకేష్ మ‌రో విజ‌యం..ఈ సారి ప్రపంచ నంబర్ 2ను ఓడించాడు

అలాంటప్పుడు సహజంగానే ఖరీదైన కార్లపై వాళ్లు మనసు పారేసుకుంటారు. ఇలా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నుండి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వరకు అందరూ కార్ కలెక్షన్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. ఖరీదైన బ్రాండ్ కార్లు మన క్రికెటర్ల కలెక్షన్లలో ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన స్టార్ క్రికెటర్లు వాడే కార్ల గురించి, వాటి ఖరీదు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1} హార్దిక్ పాండ్యా:

తన అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనలతో ఎంతగానో పేరుగాంచిన హార్దిక్ పాండ్యాకి లగ్జరీ కార్లు అంటే ఎంతో ఇష్టం. అతడు మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. అంతే లగ్జరీగా జీవించడానికి ఇష్టపడతాడు. హార్దిక్ దగ్గర కూడా ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అన్నింటికంటే ఖరీదైనది మాత్రం రోల్స్ రాయిస్ ఫాంటమ్. దీని ధర దాదాపు రూ. 10.23 కోట్లు.

2} శిఖర్ ధావన్:

టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ 2004 మెయిన్ స్ట్రీమ్ క్రికెట్ లో అడుగు పెట్టాడు. ధావన్ కి కూడా లగ్జరీ కార్లు అంటే ఎంతగానో ఇష్టం. శిఖర్ ధావన్ వద్ద ఉన్న ఖరీదైన కారు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ. దీని ధర రూ. 5.31 కోట్లు.

3} యువరాజ్ సింగ్:

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఎన్నో రకాల కార్లను కలిగి ఉన్నాడు. వీటిలో అత్యంత ఖరీదైన కారు బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పుర్. ఈ లగ్జరీ కార్ ధర రూ 5.25 కోట్లు.

4} వీరేంద్ర సెహ్వాగ్:

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వగ్ కి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది బెంట్లీ కాంటినెంటల్ జిపి ఫ్లయింగ్ స్పర్. ఇది చాలా ఖరీదైన కారు. దీని ధర సుమారు రూ. 5.25 కోట్లు.

5} రవీంద్ర జడేజా:

టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గ్యారేజ్ లో అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటిలో అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ వ్రైత్. దీని ధర రూ. 5.20 కోట్లు.

6} రోహిత్ శర్మ:

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కార్ల విషయంలో తాను ఎవరికి తీసిపోనని తన కలెక్షన్ తో తెలుపుతున్నాడు. రోహిత్ శర్మ తన గ్యారేజ్ లో లంబోర్గిని ఉరుస్ కారును పార్క్ చేసి ఉంచాడు. దీని ధర రూ. 5.10 కోట్లు.

7} మహేంద్ర సింగ్ ధోని:

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైక్ లపై ఉన్న మోజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బైక్ లపై మాత్రమే కాకుండా అతడికి లగ్జరీ కార్ల పైన కూడా అంతే మోజు ఉంది. ఈ మిస్టర్ కూల్ దగ్గర ఉన్న అత్యత ఖరీదైన కారు ఫెరారీ 599 జి.టి.ఓ. దీని ధర రూ. 4.48 కోట్లు.

8} సచిన్ టెండూల్కర్:

క్రికెట్ గాడ్ గా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి స్పోర్ట్స్ కార్లు అంటే చాలా ఇష్టం. అలాగే లగ్జరీ కార్లు కూడా ఇష్టమే. సచిన్ టెండుల్కర్ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కారు లంబోర్గిని ఉరుస్. దీని ధర సుమారు రూ 4.18 కోట్లు.

9} కేఎల్ రాహుల్:

కేఎల్ రాహుల్ కి కూడా కార్లు అంటే పిచ్చి. అందుకే ఎన్నో ఖరీదైన కార్లు అతడి గ్యారేజ్ లో కనిపిస్తాయి. అతడి వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కారు లంబోర్గిని యూరిస్ స్పైడర్. దీని ధర రూ. 4.10 కోట్లు.

10} విరాట్ కోహ్లీ:

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. క్రికెటర్లు అందరికంటే ఎక్కువగా సంపాదించే విరాట్ కోహ్లీ ఈ విషయంలో తక్కువ ఏమి కాదు. అతనికి బ్రిటన్ కి చెందిన బెంట్లీ సంస్థ కార్లు అంటే చాలా ఇష్టం. 2019లో విరాట్ కోహ్లీ రూ. నాలుగు కోట్లతో బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారుని కొనుగోలు చేశాడు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by LetsTalkNow (@letstalknow_yt)

Related News

Dream Coaching Staff: గంభీర్ తోక కట్ చేసేందుకు రంగంలోకి ఆ ఐదుగురు.. ఇక టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు

Gukesh Dommaraju: గుకేష్ మ‌రో విజ‌యం.. ఈ సారి ప్రపంచ నంబర్ 2ను ఓడించాడు

Shafali Verma: ఆసీస్ తో సెమీస్‌..ప్రతీకా రావల్ ఔట్‌, టీమిండియాలోకి లేడీ కోహ్లీ

Indian Team: ఎముక‌లు కొరికే చ‌లిలో టీమిండియా ప్రాక్టీస్‌.. చేతులు ప‌గిలిపోతున్నాయి.. వీడియో వైర‌ల్‌

PKL 2025: నేడు తెలుగు టైటాన్స్‌కు చావో రేవో… ఓడితే ఇంటికే

Suryakumar Yadav: శ్రేయాస్ అయ్య‌ర్ నాతో చాటింగ్ చేస్తున్నాడు..ఇక టెన్ష‌న్ వ‌ద్దు

BAN vs WI: 100 మీట‌ర్ల సిక్స్ కొట్టాడు.. కానీ అదే బంతికి ఔట్ అయ్యాడు.. ఎలా అంటే

Big Stories

×