Samsung Galaxy Watch 8| సామ్‌సంగ్ ఎలెక్ట్రానిక్స్ కంపెనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్ అయిన గెలాక్సీ వాచ్ 8 సిరీస్ విడుదల చేసింది. గెలాక్సీ వాచ్ 8 , వాచ్ 8 క్లాసిక్‌లను జులై 9, 2025న జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌లు గెలాక్సీ Z ఫోల్డ్ 7, Z ఫ్లిప్ 7 ఫోల్డబుల్ ఫోన్‌లతో పాటు విడుదలయ్యాయి. ఈ వాచ్‌లు స్క్విర్కిల్ (చతురస్రం, వృత్తం కలిసిన) డిజైన్‌తో వస్తాయి. గెలాక్సీ వాచ్ 8 రెండు సైజుల్లో (40mm, 44mm) అందుబాటులో ఉండగా, వాచ్ 8 క్లాసిక్ ఒకే 46mm సైజులో లభిస్తుంది.
ఈ రెండు మోడల్స్ ఎక్సినోస్ W1000 చిప్‌తో పనిచేస్తాయి, ఇందులో ప్రొగ్రామ్స్ అన్నీ వన్ UI 8.0 వాచ్ (వేర్ OS 6) సాఫ్ట్‌వేర్‌తో వస్తాయి. ఈ వాచ్‌ల డిస్‌ప్లేలు సూపర్ AMOLED టెక్నాలజీతో 327ppi డెన్సిటీ, 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తాయి.
ధర, రంగులు
గెలాక్సీ వాచ్ 8.. గ్రాఫైట్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. అయితే వాచ్ 8 క్లాసిక్ బ్లాక్, వైట్ రంగుల్లో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లు జులై 9 నుండి ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. విక్రయాలు జులై 25 నుండి ప్రారంభమవుతాయి. గెలాక్సీ వాచ్ 8 ప్రారంభ ధర రూ.32,999.
స్పెసిఫికేషన్స్
గెలాక్సీ వాచ్ 8, వాచ్ 8 క్లాసిక్ వన్ UI 8.0 వాచ్ (వేర్ OS 6) సాఫ్ట్‌వేర్‌తో నడుస్తాయి. వాచ్ 8.. 40mm, 44mm సైజుల్లో, క్లాసిక్ 46mm సైజులో లభిస్తాయి. క్లాసిక్ వేరియంట్ స్టెయిన్‌లెస్ స్టీల్ కేసింగ్, సఫైర్ గ్లాస్ కోటింగ్‌తో వస్తుంది. అయితే గెలాక్సీ వాచ్ 8 అల్యూమినియం బిల్డ్, సఫైర్ గ్లాస్ కోటింగ్‌ను కలిగి ఉంది.
ఈ వాచ్‌ల డిస్‌ప్లేలు సూపర్ AMOLEDతో రూపొందించబడ్డాయి. 3,000 నిట్స్ బ్రైట్‌నెస్, 327ppi డెన్సిటీని అందిస్తాయి. వాచ్ 8 క్లాసిక్ 1.34-ఇంచ్ డిస్‌ప్లే (438×438 పిక్సెల్స్) కలిగి ఉండగా, వాచ్ 8 40mm వేరియంట్ 1.34-ఇంచ్ (438×438 పిక్సెల్స్), 44mm వేరియంట్ Fan 1.47-ఇంచ్ (480×480 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ వాచ్‌లు ఎక్సినోస్ W1000 చిప్‌తో పనిచేస్తాయి. వాచ్ 8 క్లాసిక్ 64GB స్టోరేజ్, 2GB RAMను కలిగి ఉండగా, గెలాక్సీ వాచ్ 8 మోడల్స్ 32GB స్టోరేజ్, 2GB RAMను అందిస్తాయి. క్లాసిక్ మోడల్‌లో క్విక్ బటన్ ఉంది. ఇది ఫీచర్లను లేదా యాప్‌లను త్వరగా యాక్సెస్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే, ఇది రొటేటింగ్ బెజెల్‌ను కలిగి ఉంది. ఇది యూజర్ ఇంటర్‌ఫేస్‌లో నావిగేట్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
బ్యాటరీ, డిజైన్
గెలాక్సీ వాచ్ 8 40mm వేరియంట్‌లో 325mAh బ్యాటరీ, 44mm వేరియంట్‌లో 435mAh బ్యాటరీ, వాచ్ 8 క్లాసిక్‌లో 445mAh బ్యాటరీ ఉంది. ఈ వాచ్‌లు మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ (MIL-STD-810H), IP68 రేటింగ్‌తో వస్తాయి. ఇవి వాటర్, దుమ్ము ప్రొటెక్షన్ ఫీచర్లున్నాయి.
హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లు
ఈ స్మార్ట్‌వాచ్‌లు సామ్‌సంగ్ బయోఆక్టివ్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి, ఇది ఆప్టికల్ బయో-సిగ్నల్ సెన్సార్, ఎలక్ట్రికల్ హార్ట్ సిగ్నల్, బయోఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్ సెన్సార్‌లను కలిపి ఉంటుంది. ఇతర సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, బేరోమీటర్, గైరో సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ ఉన్నాయి. క్లాసిక్ వేరియంట్‌లో 3D హాల్ సెన్సార్ కూడా ఉంది.
ఈ వాచ్‌లు హార్ట్ రేట్ మానిటరింగ్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG), స్లీప్ అనాలిసిస్, స్ట్రెస్ మానిటరింగ్, AGES ఇండెక్స్ మానిటరింగ్, ఫాల్ డిటెక్షన్, బాడీ కాంపోజిషన్ ట్రాకింగ్, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ వంటి అనేక హెల్త్ ఫిట్‌నెస్ ఫీచర్లను అందిస్తాయి.
వాచ్ 8 కొలతలు, బరువు
గెలాక్సీ వాచ్ 8.. 40mm మోడల్.. 40.4 x 42.7 x 8.6mm కొలతలతో 30 గ్రాముల బరువు ఉంటుంది. 44mm మోడల్.. 43.7 x 46 x 8.6mm కొలతలతో 34 గ్రాముల బరువు ఉంటుంది. వాచ్ 8 క్లాసిక్ 46.7 x 46 x 10.6 mm కొలతలతో 63.5 గ్రాముల బరువు ఉంటుంది.
Also Read: ఇక అనవసర ఈమెయిల్స్ ఉండవు.. ఒక్క క్లిక్‌తో ఈజీగా చెక్
ఈ కొత్త గెలాక్సీ వాచ్ 8 సిరీస్ ఆధునిక డిజైన్, పవర్‌ఫుల్ చిప్, అధునాతన హెల్త్ ఫీచర్లతో స్మార్ట్‌వాచ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచాయి.