BigTV English

OTT Movie : 15 ఏళ్ల అమ్మాయికి 30 ఏళ్ల వ్యక్తితో బలవంతంగా పెళ్లి… ఆ కొరియన్ పిల్ల ఇచ్చే ట్విస్టుకి ఫ్యూజులు అవుట్

OTT Movie : 15 ఏళ్ల అమ్మాయికి 30 ఏళ్ల వ్యక్తితో బలవంతంగా పెళ్లి… ఆ కొరియన్ పిల్ల ఇచ్చే ట్విస్టుకి ఫ్యూజులు అవుట్

OTT Movie : టీనేజ్ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం అన్నది ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం ఉంది. అక్కడక్కడా ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలా ఓ 16 ఏళ్ల అమ్మాయిని 35 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏం జరిగిందన్న విషయాన్ని అద్భుతంగా చూపించాడు ఓ కొరియన్ దర్శకుడు. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు? కథ ఏంటి? అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ కొరియన్ మూవీ పేరు ‘మై లిటిల్ బ్రైడ్’ (My Little Bride). 15 ఏళ్ల హైస్కూల్ అమ్మాయి బో-యున్, తన తాత ఒత్తిడితో 25 ఏళ్ల వయసున్న సాంగ్-మిన్‌ ను పెళ్లి చేసుకుని, తన సాధారణ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. “మై లిటిల్ బ్రైడ్” 2004లో విడుదలైన దక్షిణ కొరియన్ రొమాంటిక్ కామెడీ చిత్రం. 2002 హాంగ్ కాంగ్ చిత్రం “మై వైఫ్ ఈజ్ 18” ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సాంప్రదాయ కుటుంబ విలువలు, యుక్తవయసు ప్రేమ, వ్యక్తిగత ఎదుగుదలను హాస్యాస్పదంగా, హార్ట్ టచింగ్ గా చూడవచ్చు. ఈ లైట్ హార్టెడ్ మూవీలో మూన్ గ్యూన్-యంగ్ (బో-యున్), కిమ్ రే-వాన్ (సాంగ్-మిన్), అన్ సన్-యంగ్ (మిస్ కిమ్), కిమ్ బో-క్యుంగ్, పార్క్ జిన్-వూ (జంగ్-వూ) నటించారు. “మై లిటిల్ బ్రైడ్” ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…
బో-యున్ (మూన్ గ్యూన్-యంగ్) ఒక 15 ఏళ్ల సాధారణ హైస్కూల్ అమ్మాయి. తన SAT పరీక్షల గురించి ఆందోళన చెందుతూ, స్కూల్ బేస్‌బాల్ టీమ్ ఆటగాడు జంగ్-వూ (పార్క్ జిన్-వూ) మీద క్రష్‌తో ఉంటుంది. ఆమె తాత (కిమ్ ఇన్-మున్) కొరియన్ యుద్ధం సమయంలో సాంగ్-మిన్ (కిమ్ రే-వాన్) తాతతో చేసుకున్న ఒప్పందం ఆధారంగా, ఆమెను 25 ఏళ్ల సాంగ్-మిన్‌ కు ఇచ్చి వివాహం చేయమని ఒత్తిడి చేస్తాడు. సాంగ్-మిన్, కెనడా నుండి తిరిగి వచ్చిన ఒక కాలేజీ విద్యార్థి. ప్లేబాయ్ ఇమేజ్ కలిగి ఉన్నప్పటికీ, బో-యున్‌ను చిన్నప్పటి నుండి ఇష్టపడతాడు. ఇద్దరూ వివాహానికి వ్యతిరేకించినప్పటికీ, తాత ఆరోగ్యం గురించి ఉన్న ఆందోళన కారణంగా వివాహం జరుగుతుంది.


Read Also :  అమ్మాయిలను టచ్ చేయకుండానే అత్యంత కిరాతకంగా చంపే సైకో… ట్విస్టులతో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

బో-యున్ తన స్కూల్ జీవితాన్ని, జంగ్-వూ మీద క్రష్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తూ, తన వివాహాన్ని రహస్యంగా ఉంచుతుంది. సాంగ్-మిన్, బో-యున్ స్కూల్‌లో ఇంటర్న్ టీచర్‌గా చేరడంతో, వారి రహస్య జీవితం హాస్యాస్పద సన్నివేశాలకు దారితీస్తుంది. ఒక టీచర్ మిస్ కిమ్ (అన్ సన్-యంగ్) సాంగ్-మిన్‌తో ఫ్లర్ట్ చేయడం, బో-యున్‌ను శిక్షించడం వంటి సంఘటనలు జరుగుతాయి. సాంగ్-మిన్ రహస్యంగా బో-యున్‌కు సహాయం చేస్తూ, ఆమె పట్ల తన నిజమైన ప్రేమను చూపిస్తాడు. ఒక కుటుంబ సమావేశంలో, బో-యున్ జంగ్-వూ తో ఉన్న వీడియో బయటపడటంతో, ఆమె తన తప్పును గుర్తిస్తుంది. మరి ఆ చిన్న పిల్ల చేసిన తప్పు ఏంటి? చివరికి వీరిద్దరూ కలిశారా? లేదా ? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×