Naveen polishetty -Raviteja: ఇటీవల కాలంలో మల్టీస్టారర్ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దర్శక నిర్మాతలు కూడా మల్టీ స్టార్ సినిమాలు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు.. ఇలా పూర్తి స్థాయిలో మల్టీ స్టార్ సినిమా లేదంటే ఒక స్టార్ హీరో సినిమాలో ఇతర హీరోలు క్యామియో పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే మరో మల్టీ స్టారర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రవితేజ(Raviteja), నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) ఒకరు.
రవితేజ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల జాబితాలో ఉన్నారు. ఇక నవీన్ పోలిశెట్టి సైతం హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే రవితేజ మాస్ జాతర (Mass Jathara)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా ద్వారా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ఇద్దరు హీరోలుగా ఓ మల్టీ స్టార్ సినిమా రాబోతుందనే వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
రవితేజ నవీన్ పోలిశెట్టి మల్టీ స్టారర్ సినిమా కథ కూడా సిద్ధమైందని, ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్(BeZawada Prassanna Kumar) కథ అందించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కథ ఇద్దరు హీరోలకు వినిపించడంతో ఇద్దరు కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.. ఇక సినిమాకు దర్శకుడు కూడా ఫైనల్ అయ్యారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే త్వరలోనే ఈ మల్టీ స్టార్ సినిమాకి సంబంధించిన అన్ని వివరాలు అధికారకంగా వెల్లడికాబోతున్నట్టు సమాచారం.
ఫుల్ ఎంటర్టైన్మెంట్ లోడింగ్..
సాధారణంగా రవితేజ , నవీన్ పోలిశెట్టి సినిమాలు అంటేనే ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాంటిది వీరిద్దరూ కలిసి ఒకే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంటే ఆ సినిమా ప్రేక్షకులను ఎంత ఎంటర్టైన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా వీరిద్దరి కాంబో సెట్ అయిందనే విషయం తెలియడంతో సూపర్ క్రేజీ కాంబో అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ భాను భోగావరపు దర్శకత్వంలో నటించిన మాస్ జాతర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ ఒకటో తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక నవీన్ పోలిశెట్టి కూడా అనగనగా ఒక రాజు సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: Anushka Shetty: బాహుబలి,భళ్ళాలదేవ ఒకే.. మరి దేవసేన ఎక్కడ? అందరి కళ్ళు ఆమెపైనే?