Cyclone Montha:సైక్లోన్ మొంథా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో పాటు తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ గాలులతో వర్షం కురుస్తుండడంతో చెట్లు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో పాములు ఇంట్లోకి చేరి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం నగరంలోని ఆరిలోవ క్రాంతి నగర్ ప్రాంతంలో భారీ కొండచిలువ సంచారం కలకలం రేపింది. ఓ ఇంటి పక్కన ఉన్న కాలువ వద్ద సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో, క్రాంతి నగర్‌లోని ఓ ఇంటి ముందు కాలువలో భారీ కొండచిలువను గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు.
విశాఖ ఆరిలోవ క్రాంతినగర్‌లో ఇంటి ముందు కాలువలో సుమారు 12 అడుగుల కొండచిలువ
కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు
అటవీ ప్రాంతంలో విడిచిన స్థానికులు.. వైరల్‌గా మారిన వీడియో pic.twitter.com/iUAcsPf6Vp
— vijay marka (@VijayMarka88) October 28, 2025
సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్లు, అతి కష్టం మీద కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా తీసుకెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ భారీ కొండచిలువను పట్టుకుంటున్న సమయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైజాగ్‌లో ఆరిలోవ క్రాంతి నగర్ ప్రాంతంలో ఓ ఇంటి పక్కన కాలువ వద్ద ప్రత్యక్షమైన కొండచిలువ కొండచిలువను పట్టుకున్న స్నేక్ క్యాచర్లు pic.twitter.com/lZIxgRVrW7
— vijay marka (@VijayMarka88) October 28, 2025