Bus Accident: కర్నూల్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బనగానపల్లెకి చెందిన పల్లెవెలుగు బస్సు తాడిపత్రికి వైపుగా వెళ్తుంది. నంద్యాల అవుకు రిజర్వాయర్ సమీపంలో వేగంగా వస్తున్న ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు మధ్య భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. సహాయ చర్యలు చేపట్టి బాధితులను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం లో ఒకరు మృతి చెందగా , ఏడుగురుకి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. మలుపు ఉన్న ప్రాంతంలో లారీ అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.