Bomb Blast Warning:గత కొద్ది నెలల నుండి దేశవ్యాప్తంగా సినీ నాయకులు, రాజకీయ నాయకుల ఇళ్లలో బాంబు బెదిరింపు వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ బాంబు బెదిరింపులు అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. సినీ ప్రముఖుల, రాజకీయ నాయకుల ఇళ్లను టార్గెట్ చేస్తూ బాంబు బెదిరింపు ఈ – మెయిల్స్ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందడంతో చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా సినీ,రాజకీయ ప్రముఖుల ఇళ్లలో బాంబులు ఉన్నట్లు ఈ- మెయిల్ ద్వారా చెబుతూ పోలీసులకు సవాల్ విసిరుతున్నారు కేటుగాళ్ళు.. అలా రీసెంట్ గా హీరోయిన్ త్రిష(Trisha), నయనతార(Nayanthara), తమిళ నటుడు , రాజకీయ నాయకుడు అయినటువంటి విజయ్ (Vijay thalapathy) ఇంటికి కూడా బాంబు బెదిరింపు వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ బాంబు బెదిరింపు వార్తలు వినిపించడంతో ఇండస్ట్రీలో కలకలం రేగుతోంది.
తాజాగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మామ అల్లుళ్లుగా పేరు దక్కించుకున్న.. తమిళ్ స్టార్ హీరోస్ అయినటువంటి రజినీకాంత్ , ధనుష్ ఇళ్లలో బాంబు ఉన్నట్టు ఈ – మెయిల్ వార్నింగ్ లు వచ్చాయి.. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో నటుడు రజినీకాంత్ , ధనుష్ ఇళ్ల లో మాత్రమే కాకుండా కిల్పాక్కంలోని తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి సెల్వపెరుతంగై ఇంట్లో కూడా బాంబు ఉన్నట్లు ఈరోజు ఉదయం చెన్నై డిజిపి ఆఫీస్ కి ఒక ఈ – మెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు వార్నింగ్ రావడంతోనే వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో పాటు స్నిఫర్ డాగ్ ల సహాయంతో అక్కడికి చేరుకొని విస్తృత సోదాలు నిర్వహించారు.
ALSO READ:Bahubali: బాహుబలి మూవీ కోసం హాలీవుడ్ డైరెక్టర్.. ప్రపంచ దృష్టి తనవైపే!
అంతేకాదు తమిళ హీరోలు అయినటువంటి రజినీకాంత్, ధనుష్ ల నివాసాలు ఉండే పోయెస్ గార్డెన్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కిల్పాక్కంలోని కాంగ్రెస్ నాయకుడు సెల్వపెరుతంగై ఇంటి దగ్గర కూడా పోలీసులు నిఘా పెట్టారు..
అయితే బాంబు బెదిరింపు ఈ – మెయిల్ రావడంతోనే పోలీసులు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్లి తనిఖీలు చేసినప్పటికీ ఎలాంటి బాంబు కనిపించలేదు. దాంతో ఈ బాంబు బెదిరింపు ఈ – మెయిల్ అనేది ఫేక్ అని అధికారులు నిర్ధారించారు.. కానీ పోలీసులు దీన్ని సులువుగా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది సినీ,రాజకీయ ప్రముఖుల ఇళ్లలో బాంబులు పెట్టినట్టు పలు ఈ- మెయిల్స్ వస్తున్నాయి. దీంతో అసలు ఈ ఈ-మెయిల్స్ ఎవరు పెడుతున్నారు..? ఎక్కడి నుండి వస్తున్నాయి? అనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఈ – మెయిల్ పెట్టిన ఆ వ్యక్తి ఎవరో గుర్తించడం కోసం సైబర్ క్రైమ్ అధికారులు ఆన్లైన్లో నిఘా నిర్వహిస్తున్నారు.. గత కొద్ది రోజులుగా సినీ,రాజకీయ ప్రముఖుల ఇళ్లలో బాంబులు పెట్టినట్టు తప్పుడు బెదిరింపులు ఎక్కువగా రావడంతో పోలీసులు , ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు.. ఇంకెన్ని రోజులు ఈ భయాందోళనలు అంటూ కామెంట్ చేస్తున్నారు.
తమిళనాడులోని రాజకీయ నాయకులు,సినీ ప్రముఖుల ఇళ్ళే లక్ష్యంగా చేసుకొని ఇలాంటి బాంబు బెదిరింపు వార్తలు రావడం ఆందోళనకరంగా మారింది.. ఇప్పటికే త్రిష,విజయ్, నయనతార తో పాటు కొంతమంది సినీ రాజకీయ నాయకుల ఇళ్లలో బాంబులు పెట్టినట్టు ఈ- మెయిల్స్ వచ్చాయి. బాంబు ఉన్నట్టు ఈ-మెయిల్ రావడంతోనే వారి ఇళ్లకు వెళ్లి పోలీసులు తనిఖీ చేసినప్పటికీ ఎలాంటి బాంబు కి సంబంధించిన ఆధారాలు కనిపించలేదు. దాంతో అవి ఫేక్ అని కొట్టిపడేశారు. ఇలా మరొకసారి ధనుష్,రజినీకాంత్ ఇళ్లలో బాంబు ఉన్నట్టు ఈ- మెయిల్ రావడంతో అలర్ట్ అయిన పోలీసులు వారి ఇళ్ళను తనిఖీ చేసినప్పటికీ అక్కడ బాంబులు కనిపించలేదు. అలా గత కొద్ది రోజులుగా ప్రముఖుల ఇళ్లను టార్గెట్ చేస్తూ తమిళనాడులో బాంబు బెదిరింపు చర్యలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి.. అయితే ప్రతిసారి బాంబు బెదిరింపు ఈ- మెయిల్ వచ్చి అవి ఫేక్ అని తెలిసినప్పటికీ పోలీసులు వాటిని సింపుల్ గా తీసుకోవడం లేదు. ఎప్పటికప్పుడు విచారణ, తనిఖీ చేస్తూనే ఉన్నారు.. అలాగే బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ ఈ ,- మెయిల్ చేసే వారు ఎవరో తెలుసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా అధికారులు ఎన్నిసార్లు వార్నింగ్ లు ఇచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్, కాల్స్ వస్తూనే ఉన్నాయి..