Vivek Oberoi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటించే ఎంతోమంది హీరో హీరోయిన్లు సినిమాలలో సంపాదించిన డబ్బుతో కొన్ని సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచితనాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్జీవోలతో కలిసి సహాయ సహకారాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి కొంతమంది హీరోలు ఏకంగా కొన్ని ప్రాంతాలను దత్తత తీసుకొని వారి బాగోగులను చూసుకుంటూ ఉండగా మరికొందరు చారిటీలను ప్రారంభించి ఎంతో మంది బాధ్యతలను తీసుకున్నారు. అయితే తాజాగా మరొక బాలీవుడ్ హీరో తన గొప్ప మనసు చాటుకున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతున్న వారిలో వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi) ఒకరు. ఈయన తెలుగులో రక్త చరిత్ర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.. ఇకపోతే వివేక్ ఓబెరాయ్ ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి డైరెక్షన్ రాబోతున్న స్పిరిట్ సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో నితీష్ తివారి (Nitesh Tiwari)దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి(Sai Pallavi) నటించిన రామాయణ సినిమాలో కూడా నటిస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేక్ ఒబెరాయ్ తన సినిమాల గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన రామాయణ సినిమా గురించి తెలిపారు. ఈ సినిమాలో తాను విభీషణుడిగా కనిపించబోతున్నానని వెల్లడించారు అలాగే ఈ పాత్ర కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం క్యాన్సర్ పిల్లల కోసం డొనేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెమ్యూనరేషన్ లో తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని నాకు ఇవ్వాల్సిన మొత్తాన్ని క్యాన్సర్ తో బాధపడే చిన్నారులకు అందించబోతున్నానని తెలిపారు.
క్యాన్సర్ పిల్లల చికిత్స కోసం..
ఈ విషయాన్ని తాను నిర్మాత నమిత మల్హోత్ర గారికి కూడా స్పష్టంగా వివరించానని తెలిపారు. ఇలా క్యాన్సర్ తో బాధపడే వారికి చికిత్స అందించడం కోసం వివేక్ ఒబెరాయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక రామాయణ సినిమా విషయానికి వస్తే సుమారు నాలుగువేల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాని 2027 దీపావళి పండుగను పురస్కరించుకొని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇక ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి, రావణాసురుడి పాత్రలో యష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: Naveen polishetty -Raviteja: రవితేజ నవీన్ పోలిశెట్టి హీరోలుగా మల్టీ స్టారర్.. క్రేజీ కాంబో అంటూ!