E-Paper
Advertisement

త్రిగుణ్ పీఆర్ టీమ్ పై రోహిత్ ఫైర్.. ఆడవాళ్ళపై పిచ్చి కామెంట్స్ అంటూ!

త్రిగుణ్ పీఆర్ టీమ్ పై రోహిత్ ఫైర్.. ఆడవాళ్ళపై పిచ్చి కామెంట్స్ అంటూ!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని సెలబ్రిటీ టాక్ షో గా గుర్తింపు సంపాదించుకున్న ఈ షోలో భాగంగా ప్రతి ఆదివారం సెలబ్రిటీలు పాల్గొంటూ సందడి చేస్తుంటారు..ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈ వారం బిగ్ బాస్ సీజన్ 10 (bigg Boss 10)కంటెస్టెంట్ రోహిత్ నాయుడు(Rohit Naidu Patnam ) హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా రోహిత్ తన బిగ్ బాస్ జర్నీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

విన్నర్ రేసులో రోహిత్..

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యుడిగా అడుగుపెట్టిన రోహిత్ తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని సెలబ్రిటీగా మారిపోయారు. ఇక రోహిత్ విన్నర్ రేస్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఊహించని విధంగా ఈయన హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ సీజన్ విన్నర్ త్రిగుణ్ అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్రిగుణ్ గెలుపు కోసం ఆయన పిఆర్ టీం సైతం అదే స్థాయిలో ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ త్రిగుణ్ పిఆర్ టీం(trigun P.R team) గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏదైనా అంటే నన్నే అనండి..

Advertisement

ఈ సందర్భంగా యాంకర్ వర్ష మాట్లాడుతూ కావాలనే కొన్ని టార్గెట్ చేశారు, చేస్తున్నారు అనిపించిన సందర్భాలు అంటూ ప్రశ్న వేయడంతో రోహిత్ త్రిగుణ్ పిఆర్ టీం గురించి మాట్లాడుతూ.. వాళ్ల మేనేజర్ ఎవరో నాపై కేసు పెడతానని మాట్లాడారు. నేను త్రిగుణ్ నే అనుకున్నాను కానీ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా .. మీరు ఏదైనా అంటే నన్నే అనండి కానీ ఆడవాళ్ళ జోలికి మాత్రం వెళ్ళద్దు. మా అమ్మ గురించి మాట్లాడటం, చెల్లి గురించి చాలా గలీజ్ గలీజ్గా కామెంట్లు చేయడం చేస్తున్నారని తెలిపారు.

Advertisement

త్రిగుణ్ పిఆర్ టీం తనని టార్గెట్ చేస్తూ ఏకంగా తన ఫ్యామిలీలో ఉన్న లేడీస్ గురించి కూడా చాలా దారుణమైన కామెంట్లు చేశారంటూ ఈ సందర్భంగా రోహిత్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.. మరి రోహిత్ ఈ అంశం గురించి ఇంకా ఎలాంటి విషయాలను బయటపెట్టారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది. ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా రోహిత్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి అలాగే నాగార్జున గారి హోస్టింగ్ గురించి కూడా మాట్లాడారు.

Also Read: ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదు.. అన్ ఫేర్ ఎలిమినేషన్ అంటున్న రోహిత్!

Related News

ప్రియుడు శివ్ కోసం తిరుమలలో మోకాళ్లపై మెట్లెక్కిన ప్రియాంక జైన్!

ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదు.. అన్ ఫేర్ ఎలిమినేషన్ అంటున్న రోహిత్!

ఇది బిగ్ బాస్ కాదురోయ్ ..మాటలతో రెచ్చిపోయిన రోహిత్- అపూర్వ!

చిన్న కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ 10 కంటెస్టెంట్.. ఎంత ముద్దుగా ఉందో!

బిగ్ బాస్ లోకి రాకముందు రోహిత్ నాయుడు జీతం ఎంతో తెలుసా?

వైష్ణవి సోనీ క్రేజ్ మామూలుగా లేదుగా.. వరుసగా హిట్ల మీద హిట్లు!

సలహా ఇస్తూనే ఏడిపించేసిన వీ.జే.సన్నీ.. ప్రియాంక ప్రవర్తనపై శివ్ తో ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×