Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయి మేయర్ కార్యాలయం, బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) కార్యాలయం పేర్లను కూడా తాజా బెదిరింపులో ప్రస్తావించారు. నవంబర్ 26న ముంబై పౌర సంస్థకు ఈ బెదిరింపు సందేశం ఈ-మెయిల్ ద్వారా అందింది. జల్సాతో పాటు ముంబయిలోని కీలక ప్రాంతాల్లో పేలుళ్లు సృష్టిస్తామంటూ అగంతకులు బెదిరించారు.
ముంబైలోని కొన్ని మెట్రో స్టేషన్లలో కూడా పేలుళ్లు సృష్టిస్తామని అగంతకుడు హెచ్చరించారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 31 మధ్య దాడులు జరుపుతామని.. వచ్చే 30 రోజుల్లో గ్రెనేడ్ దాడులు చేస్తామని మెయిల్ లో భయపెట్టారు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ బెదిరింపు మెయిల్ పై ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు. ఇది ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
Also Read: మద్దిమడుగు సభలో.. లంబాడీలకు సీఎం రేవంత్ సంచలన హామీలు!
అయితే గడిచిన 2 నెలల్లో అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు రావడం ఇది మూడోసారి. తాజాగా ముంబై మేయర్ రీతూ తావ్డే, మున్సిపల్ కమిషనర్ అశ్విని భిడేలకు సంబంధించిన కార్యాలయాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడంతో మరింత ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు.
Also Read: టీనేజర్లకు కాల్స్ కంటే టెక్స్టింగ్ ఎందుకు ఇష్టం?5 ఆసక్తికర కారణాలివే!