E-Paper
Advertisement

Hari Hara Veeramallu: వీరుమల్లు నుంచి విడుదలైన “ఎవరది.. ఎవరది” పాట

Hari Hara Veeramallu: వీరుమల్లు నుంచి విడుదలైన “ఎవరది.. ఎవరది” పాట
Advertisement

Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు(Harihara Veerumallu) సినిమా విడుదలకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎవరది ఎవరది’ పాటను(Evaradi Evaradi Song ) విడుదల చేశారు. ‘ఎవరది ఎవరది.. అతగాడో పొడుపు కథ.. దొరకనే దొరకడు అతగాడో మెరుపు కథ’ అంటూ సాగే ఈ పాట పవన్‌ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. అలాగే సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్స్ టీజర్, ట్రైలర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేసాయి.

ఆకట్టుకుంటున్న ఎవరిది.. ఎవరిది సాంగ్..

Advertisement

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఎవరిది ఎవరిది అనే పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి (M.M.Keeravani) సంగీతం అందించారు. ఇక ఈ పాటలో అద్భుతమైన లోకేషన్లతో పాటు పవన్ కళ్యాణ్ ను ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక ఈ పాట ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే పీరియాడిక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మొదట క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlmudi) దర్శకత్వం వహించగా కొన్ని కారణాలవల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలా క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ (Jyothi Krishna)ఈ సినిమా దర్శకత్వపు బాధ్యతలు తీసుకున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు..

Advertisement

నిజానికి ఈ సినిమాకు గత ఎన్నికల కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యారు అయితే రాజకీయాలలో అలాగే ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా సినిమా షూటింగులను పక్కన పెట్టడం వల్ల ఆలస్యం అవుతుంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఏయం రత్నం(A.M.Ratnam) నిర్మిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్(Nidhi Aggarwal) నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. నిజానికి ఈ సినిమా గత నెల 12వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో వాయిదా వేశారు.

ఇలా జూన్ 12వ తేదీ వాయిదా పడిన ఈ సినిమా జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈనెల 10వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. అలాగే ఈ నెల 20 వ తేదీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఏపీలో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం కూడా అభిమానులు ఎంతో ఎదురుచస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని తిరుపతి లేదా విజయవాడలో ఘనంగా ఏర్పాటు చేయాలని చిత్ర బృందం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

Also Read: Kaushal Manda: తమన్నా నా వల్లే హీరోయిన్ అయింది.. ఆమెకు ఆ కృతజ్ఞత లేదు

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×