BigTV English

Train Halted: పట్టాలపై ఏనుగు ప్రసవం.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలన్నీ బంద్!

Train Halted: పట్టాలపై ఏనుగు ప్రసవం.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలన్నీ బంద్!

భారతీయ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హజారిబాగ్-బర్కకానా రైల్వే ట్రాక్ మీద ఓ ఏనుగు ప్రసవించింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఈ మార్గంలో రైల్వే సేవలు నిలిపివేశారు. ఏనుగు తర్వాత తన బిడ్డతో కలిసి అడవిలోకి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ సేవలను ప్రారంభించారు. ఈ ఘటన రాంఘర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో జరిగింది. అటవీ, రైల్వే అధికారులు సమన్వయంగా పని చేసి తల్లిబిడ్డను సురక్షితంగా అడవిలోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకున్నారు.


ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

నిజానికి ఈ ఘటన జూన్ 25 తెల్లవారుజామున జరిగింది. ఇవాళ్టి వరకు రాంఘర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ వివరాలను వెల్లడించలేదు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన విషయం బయటకు వచ్చింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) నితీష్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. “ఓ ఏనుగుల గుంపు బొకారో, రాంఘర్ మీదుగా వచ్చి సరవాహా గ్రామానికి చేరుకుంది. ఓ గర్భిణీ ఏనుగు గుంపు నుంచి విడిపోయి రైల్వే లైన్ దగ్గరికి వచ్చింది.  పట్టాలు దాటుతున్న సమయంలో ఆ ఏనుగు ప్రసవ వేదన మొదలయ్యింది. ట్రాక్ మీదే బిడ్డకు జన్మనిచ్చింది. భారీ వర్షం కారణంగా సమీపంలోని కాలువలో నీటి ప్రవాహం పెరిగింది. ఏనుగు దూడను సురక్షితంగా అక్కడి నుంచి తరలించేందుకు కష్టమైన పనిగా మారింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులకు సమాచారం అందించాం. వారు వెంటనే స్పందించి, రైల్వే ఆ మార్గంలో రైల్వే సేవలు నిలిపివేశారు. సుమారు 2 గంటల పాటు సర్వీసులు రద్దు చేశారు. ఏనుగు తన బిడ్డతో కలిసి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయిన తర్వాత రైల్వే సేవలు యథావిధిగా ప్రారంభం అయ్యాయి” అని DFO తెలిపారు.


Read Also: పీతలు రోడ్డు దాటేందుకు.. ఏకంగా ఆ ఊర్లో వంతెనే కట్టేశారు!

బిడ్డతో కలిసి 10 కిలో మీటర్లు నడిచిన ఏనుగు

సురక్షితంగా ప్రసవించిన తర్వాత తల్లి ఏనుగు, దాని బిడ్డతో కలిసి 10 కిలోమీటర్లు నడిచింది. రైల్వే కారిడార్ దాటి తిరిగి అడవిలోకి వెళ్లాయి. ఏనుగుల గుండు ఆ ప్రాంతం నుంచి వెళ్లిన తర్వాతే రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రసవం తర్వాత అడవికి తిరిగి వచ్చే వరకు మొత్తం ప్రక్రియ ఉదయం 4 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య దాదాపు రెండు గంటల పాటు కొనసాగినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఏనుగులకు సురక్షితమైన మార్గం ఉండేలా చూసుకోవడంలో స్థానిక గ్రామస్తులు సహకరించినందుకు ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాంతంలో రైల్వే ట్రాక్ మీద ఓ ఏనుగు తన బిడ్డకు జన్మనివ్వడం ఇదే తొలిసారి అన్నారు. ఈ ఘటన నిజంగా అరుదైనదిగా అభివర్ణించారు. అటు రైల్వే అధికారుల మంచి మనసుపై ఫారెస్ట్ అధికారులు ప్రశంసలు కురిపించారు. రైల్వే సేవలు నిలిపివేసి ఏనుగు, తన బిడ్డను కాపడ్డం నిజంగా గొప్ప విషయం అన్నారు.

Read Also:  సైకిల్ పై ప్రపంచ యాత్ర చేస్తుంటే కిడ్నాప్.. ఇతడు చెప్పింది చదివితే చెమటలు పడతాయ్!

Related News

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Big Stories

×