Aaruguru Pathivrathalu Movie:ఒకప్పుడు అద్భుతమైన కథాంశంతో ప్రేక్షకులను మెప్పించి ఆకట్టుకున్న ఎన్నో చిత్రాలు.. ఈ మధ్యకాలంలో మళ్లీ కొత్త వెర్షన్లలో రీ రిలీజ్ అవుతూ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే కుర్రకారు ఫేవరెట్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకొని.. ఇప్పుడు మళ్లీ దాదాపు 22 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. అంతేకాదు 4కే వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ బోల్డ్ మూవీ కోసం ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విభిన్న కథాంశాలకు పెట్టింది పేరుగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణ. కామెడీ ని మొదలుకొని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాల వరకు ప్రేక్షకులను అలరించారు. అలాంటి ఈయన తనదైన కామెడీ టైమింగ్ తో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించిన చిత్రాలలో ‘ఆరుగురు పతివ్రతలు’ చిత్రం కూడా ఒకటి. 2004లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ చిత్రం దాదాపు 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదలవడానికి సిద్ధమవుతోంది.
నిజానికి ఆరుగురు పతివ్రతలు చిత్రాన్ని 4కే వెర్షన్లో అక్టోబర్ 29న రీ రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్రకటించింది. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ విడుదల వాయిదా పడింది. కానీ ఇప్పుడు మళ్లీ దాదాపు 40 రోజుల తర్వాత డిసెంబర్ 11వ తేదీన ఈ చిత్రాన్ని 4కె వెర్షన్ లో రీ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అప్పట్లో థియేటర్లలో సినిమా చూసినవారు మరొకసారి తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకునే అవకాశం ఉండగా.. అప్పట్లో చూడలేకపోయిన కొత్త తరం ప్రేక్షకులకి కూడా ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశాన్ని చిత్ర బృందం కల్పించింది.
also read:చిన్న వయసులోనే వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న బుల్లితెర సెలబ్రిటీ కిడ్స్!
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించడంతోపాటు ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. సుమారుగా 40 మంది కొత్తవారిని ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. అమృత, లహరి, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలకపాత్రలో నటించారు. బోల్డ్ కామెడీ తో పాటు అప్పటి సమాజంలోని వైవాహిక సంబంధాలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలను కథలో భాగంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విడుదల సమయంలో చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం కాలక్రమేనా ప్రత్యేకమైన ఒక కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈతరం ఆడియన్స్ ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.