Adivi sesh-Jagapathi Babu: అడివి శేష్ సినీ ప్రేమికులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటిస్తూ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం గూడచారి 2 పనులలో బిజీగా ఉన్నారు. అడివి శేష్(Adivi sesh) సినిమాలు ఆలస్యం అయినప్పటికీ మంచి కంటెంట్ ఉన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నారు. ఇటీవల శేష్ డెకాయిట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇలా పలు సినిమాల పనులలో బిజీగా గడపుతున్న ఈయన తాజాగా జగపతిబాబు(Jagapathi Babu) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము, నిశ్చయమ్మురా సీజన్ 2 (jayammu Nischayammu raa season 2 )కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా వీరిద్దరి మధ్య ఎన్నో విషయాల గురించి చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రోమో వీడియోలో జగపతిబాబు మాట్లాడుతూ ఇప్పుడు నిన్ను నేను ఒక టెర్రరిస్టును చేయబోతున్నాను అంటూ చెప్పగా సర్ అసలుకే మీరంటే చాలా భయం అని చెప్పడంతో వెంటనే జగపతిబాబు నువ్వు మామూలు యాక్టర్ కాదు చాలా పెద్ద యాక్టర్ వి అంటూ కామెంట్స్ చేశారు.
ఇండియన్ సిడిలు క్యాసెట్లు కొనడానికి గర్ల్స్ వచ్చేవారు అంటూ శేష్ ఏదో ఒక విషయం గురించి చెప్పబోతుండగా వెంటనే జగపతిబాబు అప్పటి నుంచే రొమాన్స్ ఉందా అని అడగగా మీ రొమాంటిక్ సినిమాలు చూసే ఇన్స్పైర్ అయ్యాను అంటూ తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వెన్నెల కిషోర్ ఒక వీడియోని ప్లే చేశారు. అలాగే డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇలా వీరి మధ్య చాలా సరదా సంభాషణలు కొనసాగాయని తెలుస్తోంది.
?hvrq=NXdta3E1ZHJ3ZjVy
ఇకపోతే ఈ కార్యక్రమంలో జగపతిబాబు శేష్ ను ప్రశ్నిస్తూ.. అసలు సుజీత్ తో నీకు గొడవలు ఏంటి అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు శేష్ సమాధానం చెబుతూ.. ఒకసారి తన వద్దకు వచ్చి ఈ సినిమా అంత గొప్ప సినిమా కాదన్నా.. కథ చెబుతాను అన్నాడు. సినిమా గొప్ప సినిమా కాదు అంటున్నావ్ ఎవడు స్టార్ట్ చేస్తాడు నరేషన్ వినడం అంటూ తాను మాట్లాడానని తెలిపారు అయితే ఒక సినిమా విషయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని ఈ ప్రోమో వీడియో చూస్తేనే తెలుస్తుంది .మరి నిజంగానే వీరి మధ్య వచ్చిన విభేదాలు ఏంటి ఏ సినిమా విషయంలో ఇలాంటి గొడవలు వచ్చాయి అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read: బాగా ఏడవాలని ఉంటుంది కానీ.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!