E-Paper
Advertisement

శోభిత షేర్ చేసిన ఫొటోకు నెటిజన్లు ఫిదా.. క్యాప్షన్ కూడా అంతే స్పెషల్!

శోభిత షేర్ చేసిన ఫొటోకు నెటిజన్లు ఫిదా.. క్యాప్షన్ కూడా అంతే స్పెషల్!
Advertisement

Sobhita Dhulipala:శోభిత ధూళిపాళ్ల..ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన ఈ భామ మొదటగా మోడలింగ్‌లోకి అడుగు పెట్టి 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెల్సిందే.అయితే తెలుగు వారికి బాగా పరిచయం అయింది మాత్రం నాగ చైతన్య బాగా పెళ్లి చేసుకున్నాక అనే చెప్పాలి.ఇక ఒకవైపు నచ్చిన సినిమాలు చేస్తునే సోషల్ మీడియా తనవైన అప్ డేట్స్ ని అభిమానులతో షేర్ చేసుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాలో లో షేర్ చేసిన ఫొటోలతో మరోసారి వార్తల్లో హైలెట్ అయిపొయింది.

ఈ ఫోటోలో శోభిత ట్రెడిషనల్ సారీలో చాలా సింపుల్‌గా కనిపిస్తూనే క్లాసీ లుక్ లో అదరగొట్టింది శోభిత. లైట్ కలర్ బ్లౌజ్‌కి మ్యాచింగ్‌గా డార్క్ షేడ్‌లో ఉన్న డిజైనర్ చీర కట్టుకుని మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ఇక షార్ట్ హెయిర్, సింపుల్ మేకప్, కాన్ఫిడెంట్ లుక్‌తో ఫోటో న్యాచురల్‌గా ఎలాంటి ఓవర్ మేకప్ లేకుండా ఉన్న ఈ ఫోటో చూసిన ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్.

Advertisement

అయితే ఫోటోలే తెగ అట్రాక్ట్ చేస్తుంటే అందులో రాసిన క్యాప్షన్ మరింత ఆకట్టుకుందని చెప్పాలి. “ఎవరో ఒకరు కేర్ తీసుకున్నారు చూపించారు కాబట్టే ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన విషయాలు వచ్చాయని నేను ఆలోచిస్తుంటాను” అనే అర్థం వచ్చేలా పెట్టిన క్యాప్షన్ తో శోభిత తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చేసింది.నిజానికి చూడటానికి ఇది చిన్న సెంటెన్స్ లాగే అనిపించినా, ఇందులో చాలా డెప్త్ ఉందని చెప్పాలి.

ఇక శోభిత సినీ కెరీర్ చూస్తే కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా, కథలో కంటెంట్ ఉన్న సినిమాలకే మొదటి నుండి వోట్ వేసుకుంటూ వస్తుంది.2024లో హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన మంకీ మ్యాన్ సినిమాతో ఇంటర్ నేషనల్ గా సత్తా చాటిన ఈ అమ్మడుఅడివి శేష్ హీరోగా చేసిన గూఢచారి సినిమాతో తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. ఆ తర్వాత వచ్చిన మేజర్ మూవీతో ఈ ఆంద్రా అందం మరింత గుర్తింపు తెచ్చుకుంది .నిజానికి ఈ రెండు సినిమాలే తన కెరీర్‌ ని టర్న్ చేశాయని చెప్పాలి.

Advertisement

ఇక హిందీలో రమణ్ రాఘవ్ 2.0, కాలాకాండి, ది నైట్ మేనేజర్ లాంటి ప్రాజెక్టులతో తన టాలెంట్ చూపించిన ఈ అమ్మడు మేడ్ ఇన్ హెవెన్ సిరీస్‌ తో తన సత్తా ఏంటో చూపించింది.ముఖ్యంగా తారా ఖన్నా క్యారెక్టర్ లో ఈ భామ అదరగొట్టేసింది.

ఇక మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో వానతిగా నటించి తమిళ తంబీల మనసుల్ని దోచుకున్న శోభిత ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న వెట్టువం అనే సినిమాతో మరోసారి పలకరించనుంది.మొత్తానికి నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్న ఈ భామ ముందు ముందు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి !

ALSO READ:కాక వెనక్కి.. విశ్వంభర ముందుకు.. సంక్రాంతికి చిరు సర్‌ప్రైజ్!

Tags

Related News

సొగసుల సుందరి కాజల్.. 40ల్లో కూడా హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తూ!

కాక వెనక్కి.. విశ్వంభర ముందుకు.. సంక్రాంతికి చిరు సర్‌ప్రైజ్!

అంచనాలు పెంచేస్తున్న వృషకర్మ.. ట్రైలర్‌తో అసలు విషయం బయటపడనుందా?

కాయదు లోహర్ ప్రేమలో పడిందా..? అస్సలు నిజం ఏంటంటే..?

ఫరియా అబ్దుల్లా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

ఓర చూపులతో చంపేస్తున్న మీనా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

నెక్స్ట్ నుంచి లెక్కలు మారిపోతాయ్.. ENE రిపీట్ ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ !

Big Stories

Advertisement
×