Sharwanand Bhogi:చార్మింగ్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న శర్వానంద్ ప్రస్తుతం ‘భోగి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడుసంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ ‘గంగ’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం.
ఇక నవంబర్ 27న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి కూడా.ఇక రిలీజ్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచిన మూవీ టీమ్ తాజాగా ‘భోగి మ్యూజికల్ సెలబ్రేషన్స్’ అంటూ ఈవెంట్ ఏర్పాటు చేయగా ఇందులో శర్వానంద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో పాటలు పాడిన నల్గొండకు చెందిన గద్దర్ నర్సన్నని ఉద్దేశించి సరదాగా మాట్లాడుతూ.. మీరు చాలామందిని ముఖ్యమంత్రులను చేశారట కదా, మరి నన్ను కూడా విజయ్‌లాగా ముఖ్యమంత్రిని చేస్తారా?అంటూ అడగడంతో ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది.దానికి గద్దర్ నర్సన్నరియాక్ట్ అవుతూ ఏమో అన్న దేవుడు కరుణిస్తే అవుతారు అంటూ చెప్పడం విశేషం . అయితే తాను ప్రస్తుతం నటుడిగా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ హ్యాపీగా ఉన్నానని మనసులోని మాటని చెప్పుకొచ్చాడు శర్వా.
ఇక ఇదే ఈవెంట్ లో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గీత రచయిత చంద్రబోస్ గురించి మాట్లాడుతూ ఆకాశానికి ఎత్తేశాడు శర్వా. సాధారణంగా ఏ సినిమాలోనైనా అన్ని పాటలు ప్రేక్షకులకు కనెక్ట్ కావడం చాలా రేర్ అనికానీ ‘భోగి’ సినిమాలోని ప్రతి పాట ఒక మంచి అనుభూతిని ఇస్తుందని తెలిపాడు.
ముఖ్యంగా చంద్రబోస్ రాసిన సాహిత్యం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని ఆయన సెట్‌కు వచ్చిన ప్రతిసారీ పాటల వెనుక ఉన్న భావాన్ని వివరిస్తుంటే, అసలు ఇంత అద్భుతంగా ఎలా రాస్తారో అని ఆశ్చర్యంగా వినేవాడినని మెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమా కోసం చంద్రబోస్ ఎంతో కష్టపడ్డారని, ఆయన ఈ చిత్రానికి ఒక బలమైన పిల్లర్ అని చెప్పడం విశేషం.
ఇక దర్శకుడు సంపత్ నంది గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు శర్వా.తాను ఇప్పటివరకు 37 సినిమాలు చేసినప్పటికీ, ఈ కథ విన్నప్పుడు అసలు తాను ఈ పాత్ర చేయగలనా లేదా అనే డౌట్ వచ్చిందని . అలాంటి సమయంలో తనపై పూర్తి నమ్మకం ఉంచిన ఏకైక వ్యక్తి సంపత్ నంది మాత్రమేనని తెలిపాడు.
ఒక పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా కనిపించాలంటే, ఒక యాక్షన్ కథను తెరపైకి తీసుకురావాలంటే ఎంత శ్రమ అవసరమో ఈ సినిమా ద్వారానే తొలిసారి తెలుసుకున్నానని వివరించాడు.సంపత్ నంది రాసుకున్న కథకు న్యాయం చేయడానికి నిజాయితీగా తన శ్రమనంతా పెట్టానని నవంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత, ప్రేక్షకులు ‘అరే.. ఇదిరా సినిమా!’ అని మనస్ఫూర్తిగా అనుకుంటారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు శర్వా !చూడాలి మరి శర్వా పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా ఏ మేరకి నిలబెడుతుందో !
ALSO READ:శోభిత షేర్ చేసిన ఫొటోకు నెటిజన్లు ఫిదా.. క్యాప్షన్ కూడా అంతే స్పెషల్!