Kajal Aggarwal:టాలీవుడ్ చందమామగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తొలిసారి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత వచ్చిన చందమామ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది.

అంతేకాదు ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ చందమామగా పేరు కూడా దక్కించుకుంది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో మిత్రవింద పాత్రతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.

తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ ఇలా వరుసగా చిత్రాలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న కాజల్ అగర్వాల్ కెరియర్ పీక్స్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, కరోనా రావడం, కొడుకుకు జన్మనివ్వడం ఇలా పలు కారణాలవల్ల కొంతకాలం గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా అనుకున్నంత స్థాయిలో స్టార్ స్టేటస్ లభించలేదు అని చెప్పవచ్చు.
also read:సోషల్ మీడియా ట్రెండ్ సెట్ చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే!

ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సొగసుల సుందరి 41 సంవత్సరాల వయసులో కూడా తరగని అందంతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన చెల్లి నిషా అగర్వాల్తో కలిసి షేర్ చేసిన ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

కోస్టలిన్ బ్రాండ్ కి చెందిన లేత గోధుమ రంగు స్ట్రాప్ లెస్ టైర్డ్ మిడి డ్రెస్ ధరించింది. ఇందులో హాట్ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పైగా ఈ ఫోటోలలో తన చెల్లి నిషా అగర్వాల్ కూడా అంతే గ్లామర్ గా కనిపించింది. చెల్లితో కలిసి దుబాయ్ కి వెకేషన్ కి వెళ్ళిన ఈమె అక్కడ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
