Vrushakarma Trailer:వరుస ప్లాపుల తర్వాత తండేల్ సినిమాతో సక్సెస్ చూసిన నాగ చైతన్య తాజాగా వృషకర్మ అంటూ మరో సినిమాతో ఆడియన్స్ ని అలరించబోతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమాని ‘విరూపాక్ష’ సినిమాతో సాలిడ్ బ్లాక్ బాస్టర్ కొట్టిన కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
ఇక ఈ మిస్టీరియస్ అడ్వెంచరస్ నుండి ఈరోజే ట్రైలర్ వదిలేందుకు ప్లాన్ చేశారు మేకర్స్.దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ 4న సినిమా వస్తుందా రాదా అన్న అనుమానాలకి మేకర్స్ ఇపుడు ఎండ్ కార్డ్ వేసినట్టే కనిపిస్తుంది.
మాములుగా రొటీన్ కి భిన్నంగా చైతు ఎప్పుడూ డిఫరెంట్ జానర్స్ ని ట్రై చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా థ్రిల్లర్ కథల విషయంలో చైతు సెలెక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటుందని గతంలో వచ్చిన ‘దూత’ వెబ్ సిరీస్‌తోనే ప్రూవ్ అయింది.ఇక ఇపుడు మరోసారి అలాంటి థ్రిల్లింగ్ ని పంచేందుకు వృషకర్మ అంటూ వస్తుండటంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు అక్కినేని ఫ్యాన్స్.మ
రోవైపు డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు తీసిన ‘విరూపాక్ష’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాలో లాగే ఇందులోనూ బలమైన కథ, ఊహించని ట్విస్టులు ఉంటాయని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.
ఇక మూవీ నుండి ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ కథపై క్యూరియాసిటీని పెంచాయనే చెప్పాలి.అయితే సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటి? నాగ చైతన్య క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? కథలో ఎలాంటి ట్విస్ట్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి? అనే విషయాలపై సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా డిబేట్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
సో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనన్న మాట.మొత్తానికి మూవీ టీమ్ ట్రైలర్ రిలీజ్ అని అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్‌లో జోష్ మరింత పెరిగిపోయింది. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ ఒక ఎత్తయితే, రాబోయే ట్రైలర్ మరో ఎత్తు అని చెప్పక్కర్లేదు కూడా.
ఇక ఈ సినిమా క్యాస్టింగ్ విషయానికి వస్తే చైతుకి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా విలన్ పాత్రలో స్పర్శ్ శ్రీవాస్తవ్ మెరవబోతున్నాడు.బాలీవుడ్ లో సంచలనం స్ప్రుష్టించిన లాపతా లేడిస్ సినిమాలో స్పర్శ్ కీ రోల్ పోషించాడని చెప్పక్కర్లేదు కూడా. ఇక ఇప్పటికే చలో పదవే , స్వాగ్ ఆఫ్ అర్జున్ పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి.కూడా చూడాలి మరి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ వృషకర్మ డిసెంబర్ 4న ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !