Fahad Fazil: ఫహద్ ఫాసిల్(Fahad Fazil) పరిచయం అవసరం లేని పేరు. ఈయనని తన సొంత పేరుతో పిలిస్తే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ భన్వర్ సింగ్ షేకావత్అంటే మాత్రం చిన్న పిల్లలకు కూడా టక్కున గుర్తుకు వస్తారు. ఈయన పేరుకే మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా నటించిన పుష్ప(Pushpa) సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
క్యాబ్ డ్రైవర్ గా…
తాజాగా ఫహద్ నటించిన మారీశన్(Mareeshan) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఫహద్ ఫాసిల్ సినిమాల గురించి అలాగే సినిమాలకు రిటైర్మెంట్(Retirement) తర్వాత తన జీవితం గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాను సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత క్యాబ్ డ్రైవర్(Cab Driver) గా మారిపోతాను అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
బార్సిలోనా సిటీ…
ఇటీవల తాను స్పెయిన్ లోని బార్సిలోనా (Barcelona)కి వెళ్ళాను. ఆ సిటీ నాకెంతగానో నచ్చిందని ఆ సిటీకి వెళ్లిన తర్వాత తాను ఒకటే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. సినిమాలకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బార్సిలోనా వచ్చి ఇక్కడే క్యాబ్ డ్రైవర్ గా సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాను అంటూ ఈ సందర్భంగా ఫహద్ ఫాసిల్ తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఇలా క్యాబ్ డ్రైవర్ గాని ఎందుకు మారాలనుకున్నారనే విషయంపై కూడా ఈయన క్లారిటీ ఇచ్చారు.
ఆ అనుభూతే వేరు…
ఒక మనిషిని తన గమ్యస్థానానికి చేర్చడం ఒక గొప్ప అనుభూతి అని ముఖ్యంగా డ్రైవింగ్ అంటే ఇష్టం ఉన్నవారికి ఇది మరింత అనుభూతుని కలిగిస్తుందని తెలియజేశారు. ఇలా ఈయన తన వింత కోరికను బయట పెట్టడంతో అభిమానులు అదరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ షాక్ లో ఉండి పోయారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా రిటైర్మెంట్ తర్వాత ఏదైనా బిజినెస్ లను చేయడం లేదా నిర్మాతలుగా మారి ఇండస్ట్రీలో కొనసాగడం వంటివి చేస్తుంటారు. కానీ, ఈయన ఏంటి ఏకంగా క్యాబ్ డ్రైవర్ గా మారిపోవాలనుకుంటున్నారు అంటూ షాక్ అవుతున్నారు. మరి ఈయన క్యాబ్ డ్రైవర్ గా మారితే నటి నజ్రియా ఒప్పుకుంటారా? అని మరి కొంతమంది సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఫహద్ రిటైర్మెంట్ తర్వాత తన లైఫ్ గోల్ గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మరి ఈయన కోరిక ఎంత మేర నెరవేరుతుందో తెలియాల్సి ఉంది.
Also Read: Bahubali The Epic: బాహుబలి ది ఏపిక్.. కొత్త సీన్లు ఉండబోతున్నాయా..జక్కన్న ప్లాన్ అదుర్స్!