BigTV English

Bahubali The Epic: బాహుబలి ది ఏపిక్.. కొత్త సీన్లు ఉండబోతున్నాయా..జక్కన్న ప్లాన్ అదుర్స్!

Bahubali The Epic: బాహుబలి ది ఏపిక్.. కొత్త సీన్లు ఉండబోతున్నాయా..జక్కన్న ప్లాన్ అదుర్స్!

Bahubali The Epic: టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(S.S. Rajamouli) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం బాహుబలి(Bahubali). ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే.


బాహుబలి ది ఎపిక్..

ఇక ఈ సినిమా విడుదలయ్యి దాదాపు పది సంవత్సరాలు అయిన నేపథ్యంలో తిరిగి ఈ సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక,నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా రెండు భాగాలు కలిపి ఒక భాగంగా” బాహుబలి ది ఎపిక్ “(Bahubali The Epic) అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఇందులో కథ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా కొన్ని సన్నివేశాలను తొలగిస్తూ అలాగే మరికొన్ని సన్నివేశాలను కూడా జోడించబోతున్నారని తెలుస్తోంది.


కొత్త సీన్లు ఉండబోతున్నాయా..

ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సెంథిల్ కుమార్ (Senthil Kumar)ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాహుబలి ది ఎపిక్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సినిమా దాదాపు 3:30ల నిడివి ఉండొచని సెంథిల్ కుమార్ తెలియజేశారు. అదే విధంగా ఈ సినిమాలో అవసరం లేని కొన్ని సన్నివేశాలను తీసేసి సరికొత్త సన్నివేశాలను జోడించబోతున్నారని తెలియజేశారు. ఈ సినిమా ఎడిటింగ్ లో భాగంగా కొన్ని సన్నివేశాలను తొలగించారని అయితే వాటిని ఇప్పుడు యాడ్ చేయబోతున్నారని తెలియజేయడంతో ఈ సినిమాపై మరి కాస్త అంచనాలు పెరిగాయి. ఇలా మనం చూడని సన్నివేశాలని జోడిస్తే కనుక సినిమా మొత్తం సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.

ప్రభాస్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్…

ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసమే జక్కన్న ఇలా కొత్తగా ప్లాన్ చేశారని చెప్పాలి. ఇక 10 సంవత్సరాల క్రితం వచ్చిన బాహుబలి సినిమా అప్పట్లోనే ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది. అయితే మరోసారి ఈ సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 31వ తేదీ విడుదల కాబోతున్న విషయాన్ని స్వయంగా రాజమౌళి తెలియచేశారు. అప్పట్లో ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపిందని చెప్పాలి. అప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఇంత భారీ బడ్జెట్ సినిమాగా ఏ సినిమా కూడా విడుదల కాలేదు. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అవ్వటమే కాకుండా, ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

Also Read: Senthil Kumar: రాజమౌళి అందుకే పక్కన పెట్టాడు.. అసలు విషయం చెప్పిన సెంథిల్!

Related News

Kalki 2898 AD: ప్రభాస్‌తో ముదిరిన వివాదం… కల్కీ 2 నుంచి దీపికా పదుకొణె అవుట్

Manchu Lakshmi: కుటుంబంలో గొడవలు.. నేను సైలెంట్ గా ఉండడానికి కారణం అదే

Andhra King Taluka: ఆంధ్రా కింగ్ కు బర్త్ డే .. ఉపేంద్ర పోస్టర్ రిలీజ్

Allu vs Mega :పాన్ ఇండియా మెగాస్టార్ గా బన్నీ.. కథ సుఖాంతం అనుకుంటే.. మళ్లీ మొదలెట్టారే..

Fauji Movie : ‘ఫౌజీ’ లో బాలీవుడ్ బడా హీరో.. డైరెక్టర్ ప్లానింగే వేరప్పా..

Nag 100: నాగార్జున 100వ సినిమా ముహూర్తం ఆరోజే.. గెస్ట్ గా ఆ స్టార్ హీరోస్.. టైటిల్ కూడా

RGV: వర్మపై మరో కేసు ఫైల్.. తప్పుదోవ పట్టించారంటూ?

Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి

Big Stories

×