BigTV English
Advertisement

Injured Cricket Players: రక్తాలు కారినా… గ్రౌండ్ లో అడుగుపెట్టి మ్యాచ్ ఆడిన వీరులు వీళ్లే

Injured Cricket Players: రక్తాలు కారినా… గ్రౌండ్ లో అడుగుపెట్టి మ్యాచ్ ఆడిన వీరులు వీళ్లే

Injured Cricket Players: టెండూల్కర్ – అండర్సన్ 2025 ట్రోఫీలో భాగంగా ఐదు టెస్ట్ లు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో ఆతిథ్య జట్టు 2 – 1 తో ఆదిక్యంలో ఉంది. ఇక ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పటివరకు రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీల సాయంతో ఏకంగా 462 పరుగులు చేశాడు.


Also Read: Ben Stokes – Pant: రిషబ్ పంత్ కాలుపై కుట్రలు చేసిన స్టోక్స్.. కావాలనే ఆ బంతులు వేసి!

కాగా మాంచెస్టర్ వేదికగా బుధవారం రోజు ప్రారంభమైన నాలుగో టెస్ట్ లోను రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. ఐదవ స్థానంలో బ్యాటింగ్ కి దిగిన పంత్.. 48 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 37 పరుగులు చేశాడు. ఆ సమయంలో క్రిష్ వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్విప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ బంతి పంత్ కుడికాలి పాదానికి తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్ మధ్యలోనే రిటైర్డ్ హార్ట్ గా మైదానాన్ని వీడాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు.


అయితే మైదానంలో పంత్ కాలి నుండి రక్తం కారడంతో నడిచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. ఇక అతడు ఈ మ్యాచ్ ఆడడం కష్టమేనని అంతా భావించారు. కానీ అనుహ్యంగా మరోసారి క్రీజ్ లోకి దిగాడు. ఇబ్బంది పడుతూనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గతంలో కూడా ఇలా రక్తాలు కారినప్పటికీ.. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి మ్యాచ్ ఆడిన వీరుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది.

గతంలో ఇలా గాయాలపాలై కూడా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన కొంతమంది క్రికెటర్లలో అనిల్ కుంబ్లే, కేదార్ జాదవ్, హనుమ విహారి, రోహిత్ శర్మ, బుమ్రా, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటి పలువురు కీలక ప్లేయర్లు ఉన్నారు. 2002 సంవత్సరంలో వెస్టిండీస్ తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్ అక్కడికి వెళ్లింది. ఇందులో నాలుగోవ టెస్ట్ లో అనిల్ కుంబ్లే బ్యాటింగ్ చేస్తుండగా.. దిల్లాన్ విసిరిన షార్ట్ పిచ్ బంతి కుంబ్లే తలకు బలంగా తాకింది. దీంతో వెంటనే మైదానంలో కుప్పకూలిన కుంబ్లే.. ఆ కాసేపటికే బ్యాటింగ్ కొనసాగించాడు.

ఇక 2011లో బ్రెట్ లీ తలకి కూడా తీవ్ర గాయం అయింది. అతడి కనుబొమ్మపై నుండి తీవ్రంగా రక్తం కారినప్పటికీ.. కాసేపటికే తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఇక 2016లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎడమ చేతి బొటనవేలికి తీవ్ర గాయమైంది. ఆ బొటనవేలుకి ఏకంగా 9 కుట్లు పడ్డాయి. అయినప్పటికీ అతడు కాసేపటికే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి బ్యాటింగ్ కొనసాగించాడు. ఐపీఎల్ 2016లో బెంగళూరు – పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మకు తీవ్ర గాయం అయింది.

Also Read: RCB – Stampede: RCB కి మరో ఎదురు దెబ్బ.. ఇకపై చిన్న స్వామిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడేది లేదు.. ఆ గ్రౌండ్ పై నిషేధం?

దీంతో మైదానం వీడిన రోహిత్ శర్మ.. వైద్య సహాయం తీసుకుని తిరిగి వచ్చి మ్యాచ్ లో పాల్గొన్నాడు. 2021లో హనుమ విహారి కూడా గాయంతోనే మైదానంలోకి దిగి.. తన అద్భుత బ్యాటింగ్ తో జట్టుకు సహాయం చేశాడు. ఇలా గాయం కారణంగా మైదానం వీడి.. తిరిగి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మహమ్మద్ రిజ్వాన్, అలెక్స్ క్యారీ, సమర్ జోసెఫ్, యువరాజ్ సింగ్, జి. స్మిత్, మాల్కమ్ మార్షల్, తమీమ్ ఇక్బాల్, నాథన్ లియోన్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.

Related News

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌,Mega వేలంషెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Womens World Cup 2025: హ‌ర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా

PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్​ల బహుమతి!

SRH -IPL 2026: హైద‌రాబాద్ ఫ్యాన్స్ కు షాక్‌… కాటేర‌మ్మ కొడుకును గెంటేస్తున్న కావ్య పాప ?

IND VS SA: ఇంత‌కీ ఈ చిన్నారి ఎవ‌రు.. వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎందుకు వైర‌ల్ అయింది?

Jemimah Rodrigues: మరోసారి దొరికిపోయిన జెమిమా… హిందూ ధర్మాన్ని అవమానిస్తూ!

IPL 2026-KKR: కేకేఆర్ లో వేలుపెట్టిన గంభీర్‌…హ‌ర్షిత్ రాణాకు కెప్టెన్సీ ?

IND VS SA: నీకు సిగ్గుందా.. ఏబీ డివిలియర్స్ పై న‌టి హాట్ కామెంట్స్‌.. ఇండియాకే వెళ్లిపో !

Big Stories

×