Balakrishna vs Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నటించిన ప్రభాస్(Prabhas) ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నప్పటికీ ఆయన ఇటీవల మంచు విష్ణు(Manchu Vishnu) సినిమాలో క్యామియో పాత్రలో నటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. కన్నప్ప(Kannappa) సినిమాలో రుద్ర (Rudra)అనే పాత్రలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని చెప్పాలి. కన్నప్ప సినిమాకు రుద్ర పాత్ర హైలెట్ అవ్వడమే కాకుండా సినిమాని విజయపతంలో నడిపిస్తోంది. ఇక తమ అభిమాన హీరోని తెరపై చూసే అవకాశం ఇలా కలిగినందుకు ప్రభాస్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున కన్నప్ప సినిమాకు వెళ్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటన క్లైమాక్స్ సన్నివేశాలు హైలెట్ అంటూ ప్రేక్షకులు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
రుద్ర పాత్రలో బాలయ్య?
ఇలా ఇప్పటివరకు అంతా బానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రుద్ర పాత్ర గురించి బాలకృష్ణ (Balakrishna)వర్సెస్ ప్రభాస్ అనే విధంగా చిన్నపాటి వార్ జరుగుతుందని చెప్పాలి. ప్రభాస్ నటించిన రుద్ర పాత్రలో ప్రభాస్ కాకుండా బాలకృష్ణ కనుక నటించి ఉంటే సినిమాకు మరింత హైప్ వచ్చి ఉండేది అంటూ బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో బాలకృష్ణ ఎక్కువగా ఈ తరహా గెటప్ లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ముఖ్యంగా అఖండ 2 సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ లో బాలయ్య లుక్ అదిరిపోయిన సంగతి తెలిసిందే.
చరిత్రలో నిలిచిపోయేది..
ఈ క్రమంలోనే కన్నప్ప సినిమాలో కూడా రుద్ర పాత్రలో బాలయ్య కనుక చేసి ఉంటే కన్నప్ప సినిమా కూడా చరిత్రలో నిలిచిపోయేది అంటూ కామెంట్లు చేస్తున్నారు .ప్రభాస్ అభిమానులు కూడా రుద్ర పాత్ర పై స్పందిస్తూ.. ఈ సినిమాలో రుద్ర పాత్రలో బాలకృష్ణ కంటే ప్రభాస్ చాలా బాగా సెట్ అయ్యారని ఆయన నటన కూడా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక బాలయ్య ఈ సినిమాలో రుద్ర పాత్రలో నటించి ఉంటే అది అఖండనే అవుతుంది తప్పా, కన్నప్ప ఎందుకు అవుతుంది అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా ఈ రుద్ర పాత్ర విషయంలో నందమూరి అభిమానులు ప్రభాస్ అభిమానుల మధ్య చిన్నపాటి వార్ జరుగుతుంది.
సంవత్సరానికి ఒక్క సినిమా..
ఇక ప్రభాస్ కల్కి సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన కన్నప్ప సినిమాలో క్యామియో రోల్ చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన రాజా సాబ్(Raja Saab) సినిమా ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదలలోపు ఇలా కన్నప్ప సినిమా ద్వారా ప్రభాస్ వెండితెరపై సందడి చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజా సాబ్ సినిమాతో పాటు ప్రభాస్ స్పిరిట్, ఫౌజి, కల్కి 2, సలార్ 2 వంటి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమాలన్నీ వరుసగా ప్రతి ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నారు.
Also Read: రజినీకాంత్ చొక్కా విప్పిస్తే లక్ష ఇస్తా.. చాలెంజ్ చేసిన డైరెక్టర్.. ఏం జరిగిందంటే?