Nagarjuna Health Secret: టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా ఎంతోమంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటుడు నాగార్జున (Nagarjuna)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అయితే నాగార్జున ఏడుపదుల వయసుకు దగ్గర పడుతున్న ఇప్పటికీ అంతే యంగ్ లుక్ లో కనిపిస్తూ యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలా తన కొడుకులతో సమానంగా అదే అందాన్ని మెయింటైన్ చేయడం బాడీ ఫిట్నెస్ ఏమాత్రం కోల్పోకుండా హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు.
హెల్త్ సీక్రెట్ ఇదే..
ఈ క్రమంలోనే ఎంతోమంది నాగార్జున ఇలా ఇప్పటికీ యంగ్ లుక్ లో కనిపించడానికి గల కారణమేంటి అసలు ఆయన ఏం తీసుకుంటారనే సందేహం కూడా అందరికీ కలుగుతూ ఉంటుంది. అయితే తన హెల్త్ సీక్రెట్(Health Secret) గురించి నాగార్జున ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.. తాను హెల్త్ కాపాడుకోవడానికి ఫిట్నెస్ కాపాడుకోవడానికి పెద్దగా ఏమీ చేయనని తెలిపారు. తనుకు నచ్చిన ప్రతి ఫుడ్ తీసుకుంటానని తెలిపారు. ప్రతిరోజు ఉదయం గంట లేదా రెండు గంటలు వర్కౌట్స్ చేస్తానని, ఇక నాకు ఏది నచ్చుతుందో ఆ ఫుడ్ మొత్తం తీసుకుంటానని తెలిపారు. ఫుడ్ డైట్ అలాంటివి తాను మెయింటైన్ చేయనని తెలిపారు.
రోజు రాత్రి అది ఉండాల్సిందేనా?
ఇక ప్రతిరోజు అందరితోపాటు అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు తీసుకుంటానని అయితే రాత్రి పడుకోవడానికి ముందు కచ్చితంగా ఒక స్వీట్ ఏదైనా తినే పడుకుంటానని తెలిపారు. అలాగే రోజుకు రెండు రౌండ్లు వేసుకుంటాను అంటూ ఆ**ల్ గురించి కూడా మాట్లాడారు. ఇదేనా హెల్త్ సీక్రెట్ అని ఇంతకు మించి తాను ఎలాంటి వర్కౌట్స్ కానీ డైట్ కానీ ఫాలో అవ్వనని తెలిపారు. ఇక సండే వచ్చింది అంటే తాను ఎలాంటి పనులు ముట్టుకోను, కేవలం ఇంట్లో ఉండి నాకు నచ్చినట్టుగా మనస్ఫూర్తిగా తింటూ ఆరోజును ఎంజాయ్ చేస్తానని తెలిపారు.
హీరోగా సినిమాలు చేయ్యారా?
ఇలా నాగార్జున తన హెల్త్ సీక్రెట్ గురించి తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగార్జున కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన హీరోగా సినిమాలు చేయడం కంటే కూడా ఎక్కువగా క్యామియో పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ రష్మిక నటించిన కుబేర(Kuberaa) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ (Coolie)సినిమాలో కూడా నాగార్జున ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇలా పలు సినిమాలతో పాటు ఈయన బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమం కూడా ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక లోగో ప్రోమో కూడా విడుదల చేశారు.
Also Read: బాలయ్య vs ప్రభాస్.. మొదలైన వార్.. బాలయ్య చేసుంటే వేరే లెవల్ !