Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజనీకాంత్ స్టార్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినప్పటికీ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల జైలర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రజినీకాంత్ త్వరలోనే కూలి (Coolie)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో రజనీకాంత్ కి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
రజనీకాంత్ ఎంతో అద్భుతమైన నటుడు అనే విషయం మనకు తెలిసిందే. ఎలాంటి డైలాగ్ అయినా, అద్భుతమైన హవభావాలాను పలికిస్తూ ఎంతో సునాయసంగా నటిస్తుంటారు. అయితే డాన్స్ విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తారని తెలుస్తోంది. ఇలా డాన్స్ విషయంలో చిరంజీవి, కమల్ హాసన్ వంటి వారిని చూస్తే తనకు వణుకు వస్తుందని స్వయంగా రజనీకాంత్ ఓ సందర్భంలో చెప్పినట్టు చోటా కె నాయుడు(Chota K Naidu) ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రజనీకాంత్ హీరోగా నటించిన బాబా సినిమాకు చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ సినిమాలో ఒక సాంగ్ షూటింగ్లో భాగంగా రజనీకాంత్ చోటా కె నాయుడు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం చెందినట్లు తెలియజేశారు.
లక్ష రూపాయలు ఛాలెంజ్ చేశారా?
సమ్మర్ కావడంతో ఈ పాట షూటింగ్ చేసేటప్పుడు రజనీకాంత్ షర్టు మొత్తం తడిసిపోయింది దీంతో డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న తరుణ్ మాస్టర్(Tarun Master) వద్దకు వెళ్లి సర్ రజనీకాంత్ గారి షర్టు మొత్తం తడిసిపోయింది తనని షర్టు మార్చమని చెప్పండి అని చెప్పాను. దాంతో తరుణ్ మాస్టర్ అది కుదరదు కానీ, నువ్వు వెళ్లి షూటింగ్ చేసుకో అని చెప్పారు. అయినా నేను మరోసారి చెప్పడంతో నువ్వు వెళ్లి ఇప్పుడు రజనీకాంత్ తో షర్ట్ మార్పిస్తే నీకు ఇప్పుడే లక్ష రూపాయలు ఇస్తాను అంటూ చాలెంజ్ చేశారు.
డాన్స్ అంటే అంత భయమా?
తరుణ్ మాస్టర్ అలా మాట్లాడటంతో రజినీకాంత్ గారి వద్దకు వెళ్లి షర్టు మార్చమని చెబితే ఆయన ఒక్కసారిగా కోప్పడుతూ నేను షర్ట్ మార్చను నువ్వు వెళ్లి షూట్ చేసుకోకు అంటూ అందరి ముందు గట్టిగా అరిచారు. నాకు చాలా అవమానంగా అనిపించింది. ఇక షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత రోజు సాయంత్రం ఫోన్ చేసి ఆయన ఒక వైపు చిరంజీవి కమల్ హాసన్ వంటి వారు డాన్సులతో అదరగొడుతున్నారు, నాకేమో డాన్స్ రాదు, ఆ టెన్షన్ లో నేను ఉంటే నువ్వు షర్ట్ మార్చమని చెప్పేసరికి కోపం వచ్చిందని రజనీకాంత్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టినట్లు చోటా కె నాయుడు తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇలా నటనలో రజినీకాంత్ తోపు అయినప్పటికీ డాన్స్ విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తారని తెలియడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.
Also Read: మీ పిల్లలు అనే ఒకే ఒక్క కారణం తప్పా… ఏం చేశారు అసలు ?