Fans Requests to Anil Ravipudi: రీఎంట్రీ మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్లో ఉండగానే.. మరో ప్రాజెక్ట్స్ని లైన్లో పెడుతూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కతోన్న చిత్రం ఒకటి. ప్రస్తుతం చిరు మోస్ట్ అవైయిటెడ్ సినిమాలో ఇదే అని చెప్పడం సందేహం లేదు. కేవలం ప్రకటనతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇటీవల చిరు పుట్టిన రోజు సందర్భంగా వదిలిన గ్లింప్స్, టైటిల్ మూవీపై మరింత బజ్ పెంచాయి.
ముఖ్యంగా ఇందులో చిరు లుక్.. ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. షూటు, బూటూ..మెడలో టై..చేతిలో ఏకే47తో బాస్ లుక్ అదిరిపోయింది. వింటేజ్ చిరంజీవిని చూసినట్టు ఉందని, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇక ఈ చిత్రానికి మన శంకర వరప్రసాద్ గారూ టైటిల్ కాగా పండక్కి వస్తున్నారు ట్యాగ్ లైన్. ఈ టైటిల్ మూవీపై మరింత ఆసక్తి పెంచుతోంది. బాస్ లుక్ ఓవైపు.. ఈ టైటిల్ మరోవైపు మూవీ వీపరీతమైన బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక చిరు వింటేజ్ లుక్‌లో కనిపించడంతో.. అనిల్ రావిపూడి ఈసారి ఏదో భారీగా ప్లాన్ చేశారని, ఈ సంక్రాంతికి అభిమానులకు మెగా ట్రీట్ గ్యారంటీ అంటూ అంచనాలు వేసుకుంటున్నారు.
పైగా ఇందులో విక్టరీ వెంకటేష్ కూడా భాగం అవుతున్నారు. దీంతో ఇది దొంగ మొగుడు, చట్టబ్బాయి తరహాలో ‘మన శంకర వరప్రసాద్ గారూ..’ మూవీలా ఉండబోతుందని అంటున్నారు. ఇక బాస్ నుంచి ఫుల్ లెన్త్ కమెడీ చూసి చాలా కాలం అయ్యిందని, ఈసారి అనిల్ రావిపూడి చిత్రంతో అది తీరబోతుందని సంతోషిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడికి అభిమానుల నుంచి కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో వింటేజ్ చిరుని చూపించినట్టే.. 90’s సాంగ్స్ రీమేక్ చేసి పెట్టమని కోరుతున్నారట. అది చిరంజీవి సినిమాలోనే పాటలనే తీసుకుని పెట్టమని అనిల్ రావిపూడిని కోరుతున్నారు. ప్లీజ్ అనిల్ రావిపూడికి ఎవరైనా చెప్పండి. మన శంకర వరప్రసాద్ సినిమాలో 90’s మెలోడి సాంగ్స్ని రీమిక్స్ చేయమనండి.
Also Read: Allari Naresh: అల్లరి నరేష్ సినిమాలో అల్లు అర్జున్ – అట్లీ స్టాఫ్.. ఇక మాములుగా ఉండదు!
ఇది సినిమాకు మరింత పవర్ ఇస్తుంది. ఇప్పటికే సినిమాకు మంచి బజ్ ఉంది. ఇక ఓల్డ్ మెలోడీ సాంగ్స్ రీమిక్స్ చేస్తే.. అది ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. ఫ్యాన్స్ కోరిక కూడా ఫుల్‌ఫిల్ అవుతుంది. ఇందులో బలవంతం ఏం లేదు. కథ డిమాండ్ చేస్తే పెట్టండి అంటూ ఆయనకు అభిమానుల నుంచి రిక్వెస్ట్స్ వస్తున్నాయట. మరి ఫ్యాన్స్ డిమాండ్స్, కోరిక మేరకు అనిల్ రావిపూడి ఈ విషయాన్ని గమనించాలని సినీ వర్గాలు కూడా ఆయనకు సూచిస్తున్నారట. మరి దీనిపై అనిల్ రావిపూడి నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిని సంతరించుకుంది. మరి ఫ్యాన్స్ డిమాండ్స్ మేరకు ఆయన చిరు చిత్రంలోనే ఏదైనా ఓల్డ్ హిట్ మెలోడిని రిమిక్స్ చేస్తారా? లేదా? చూడాలి. ఒకవేళ అలా చేస్తే మాత్రం.. ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం ‘మన శంకర వరప్రసాద్’ మూవీకి మరింత ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.