Sivakarthikeyan : కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు శివ కార్తికేయన్. రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు తమిళ్లో శివ కార్తికేయన్ ఏ సినిమా చేసినా కూడా అది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. తెలుగు సినిమా ప్రేక్షకుల గురించి కొత్తగా చెప్పేదేముంది. ఒక మంచి సినిమా ఏ భాషలో వచ్చినా కూడా దానిని ఎంకరేజ్ చేస్తుంటారు. అలానే చాలామంది స్టార్స్ ను ఓన్ చేసుకుంటారు.
అందుకే మిగతా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఇష్టపడతారు. తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. శివ కార్తికేయన్ కూడా మదరాసి సినిమాకి సంబంధించి ఈవెంట్ లో తెలుగు మాట్లాడాడు. శివ కార్తికేయన్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఇక తన మదరాసి సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండడంతో తెలుగులో ప్రమోషన్ చేస్తున్నాడు.
చాలామంది సెలబ్రిటీల మీద గాసిప్స్ రాస్తూ ఉంటారు. దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. కొన్ని సందర్భాలలో ఎవరిమీదైతే రాయబడ్డాయో వాళ్లే స్వయంగా మాట్లాడితే గానీ క్లారిటీ రాదు. అయితే ఇది కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా ఉంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో శివ కార్తికేయన్ మాట్లాడుతూ నామీద చాలా ఫేక్ న్యూస్ లు క్రియేట్ చేశారు. నా ఫేస్ ని ఎనలార్జ్ చేసి ఇతను డ్రగ్స్ తీసుకుంటాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు అంటూ నా ఫోటోలు వైరల్ చేశారు. అంటూ చెప్పాడు. అలానే అమరన్ సినిమా టైంలో నా ఫోటోకి 8 ప్యాక్ క్రియేట్ చేశారు. నాకసలు ప్యాకే లేదు అంటూ శివ కార్తికేయన్ అని చెప్పాడు
ఒకప్పుడు ఏ ఆర్ మురగదాస్ కి మంచి క్రేజ్ ఉండేది. అతను తీసిన గజిని (Ghajini), రమణ (Ramana), సెవెంత్ సెన్స్ (7th sense) వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఏ ఆర్ మురగదాస్ మాట్లాడుతూ తమిళ్ ప్రేక్షకులు ఎడ్యుకేట్ చేస్తారు. తెలుగు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తారు అంటూ చెప్పాడు. ఇక్కడతో ఈ దర్శకుడు మీద కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దానివలన సినిమా మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సినిమా ఏ మాత్రం ఫెయిల్ అయినా కూడా మళ్లీ ఈ కామెంట్స్ వైరల్ అవ్వడం ఖాయం.
Also Read: Anushka Shetty : ఇంతకుముందు ఎప్పుడూ అలా చేయలేదు, అసలు విషయం బయట పెట్టేసింది