Jr.NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తారక్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా, పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ ఉన్న ఎన్టీఆర్(Jr.NTR) గురించి ప్రముఖ బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (Kamaal R.Khan)చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈయన ఫిలిం క్రిటిక్ గా సినిమాలకు రివ్యూ ఇస్తూ చేసే వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు కారణం అవుతుంటాయి. సినిమా విడుదల కాకుండానే సినిమాపై ఓ విధంగా నెగిటివ్ రివ్యూ ఇస్తూ పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్నారు.
ఇలా నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే కమల్ ఆర్ ఖాన్ తాజాగా ఎన్టీఆర్ సినీ కెరియర్ క్లోజ్ అయింది అంటూ మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. కమల్ ఆర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తారక్ ఫాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా అనంతరం ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వంలో హృతిక్ రోషన్(Hrithik Roshan) ఎన్టీఆర్ వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తద్వారా తారక్ అభిమానులు కొంతమేర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే కమల్ ఆర్ ఖాన్ ఎన్టీఆర్ బాలీవుడ్ సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ… బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కెరియర్ ముగిసిపోయిందని తెలిపారు. వార్ 2 ఫెయిల్యూర్ తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ నటుడు హృతిక్ రోషన్ తో క్రిష్4 చేయకూడదని నిర్ణయం తీసుకుంది.
ఎన్టీఆర్ తో సినిమాలు రద్దు..
ఇక దర్శకుడు ఆయాన్ ముఖర్జీను ధూమ్ 4 నుంచి కూడా తప్పించారు. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ ఇకపై యష్ రాజ్ ఫిలిమ్స్ లో సినిమాలు చేయరని అదేవిధంగా ఎన్టీఆర్ తో కమిట్ అయిన సినిమాలను కూడా రద్దు చేసుకున్నారని కమల్ ఆర్ ఖాన్ తెలిపారు. దీంతో ఎన్టీఆర్ బాలీవుడ్ సినీ కెరియర్ వార్ 2 సినిమాతోనే ముగిసిపోయింది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈయన తీరుపై మండిపడుతున్నారు. ఎన్టీఆర్ ది గ్లోబల్ రేంజ్ అని బాలీవుడ్ లో తన కెరియర్ క్లోజ్ అవ్వడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం తదుపరి సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Also Read: Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు