సౌత్ ఇండియాలో అతి పెద్ద రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. రోజూ వేలాది మంది ప్రయాణీకులతో బిజీగా ఉంటుంది. నిజాం కాలంలో నిర్మితమైన ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను పునర్నిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా అద్భుతంగా నిర్మిస్తోంది. సుమారు రూ.750 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్ పోర్టు మాదిరి సౌకర్యాలతో కళ్లు చెదిరేలా రూపుదిద్దుకుంటుంది. నిర్మిస్తోంది. పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మల్టీ లెవెల్ పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా సహా కీలక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తాజాగా కొత్త కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఇది ప్లాట్ ఫారమ్ 1 నుంచి ప్లాట్ ఫారమ్ 10 వరకు అన్నింటినీ అనుసంధానిస్తుంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదికి చేరుకున్న ప్రయాణీకులు ఏ ప్లాట్ ఫారమ్ మీదికైనా ఈజీగా చేరుకునే అవకాశం ఉంటుంది. పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో ప్రయాణీకులకు రద్దీ పెరిగింది. నిర్మాణ పనుల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వీటి నుంచి బయటపడేందుకు మెయిన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారు. పండుగ సీజన్ లో ఇంటర్ ప్లాట్ ఫామ్ కనెక్టివిటీని మెరుగుపరచనుంది. క్రౌడ్ కంట్రోల్ కు ఉపయోగపడనుంది. అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రయాణికులకు ఎంతో ఊరట కలిగించనుంది. ఇప్పటి వరకు స్టేషన్ లో తక్కువ సంఖ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు ఉండటంతో ఇబ్బందులు కలిగేవి. కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ స్టేషన్‌లోని అన్ని ప్లాట్ ఫార్మ్ లను అనుసంధానిస్తూ, ఎస్కలేటర్లు, లిఫ్ట్ లు, ర్యాంపులు సహా ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలకు బాగా ఉపయోగపడనుంది.
As part of major redevelopment works at Secunderabad Station, Telangana, a new Foot Over Bridge connecting PF 1-10 has been commissioned, improving inter-platform connectivity & enabling efficient crowd management during the upcoming festive season. pic.twitter.com/lXfNMEYYwA
— Ministry of Railways (@RailMinIndia) October 9, 2025
ఇక రైల్వే స్టేషన్ లో పార్కింగ్ కోసం అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. పార్కింగ్ ఇబ్బంది లేకుండా మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణాలు చేపడుతున్నారు. స్టేషన్‌కి వచ్చే ప్రయాణికులు వాహనాలను నిలిపేందుకు స్థలం లేక ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదురయ్యేది. ఈ నేపథ్యంలోనే 4 నుంచి 5 అంతస్తుల పార్కింగ్ సౌకర్యం కలిగిన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ పార్కింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే, వాహనాలను ఈజీగా పార్క్ చేసే అవకాశం ఉంటుంది. ట్రాపిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ లో బస్సులు, ఆటోలు, ప్రయాణికులు.. అంతా ఒకే చోట కలవడం వల్ల ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక లేన్లు, పికప్ డ్రాప్ జోన్లు, విశ్రాంతి ప్రాంతాలు, సిమెంట్ రోడ్లు, గ్రీనరీ ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా ఈ రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్టు మాదిరిగా రూపొందనుంది.
Read Also: నదీ గర్భంలో 33 మీటర్ల లోతులో.. చిరుతలా దూసుకెళ్లే రైలు గురించి మీకు తెలుసా?