SSMB 29 Title Leak : దర్శకధీరుడు, తెలుగు ఇండస్ట్రీని అందలం ఎక్కించిన రాజమౌళి నేడు బర్త్ డే జరుపుకుంటున్నాడు. సెలబ్రెటీలు అందరూ జక్కన్నకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే, ఆయన బర్త్ డే రోజు SSMB 29 మూవీ టైటిల్ గురించి ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. ఈ మధ్య ఈ SSMB 29 మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు అంటూ తెగ వార్తలు వచ్చాయి. దీనికి ముందు మరికొన్ని టైటిల్స్ ప్రచారం సాగాయి. అయితే, వీటి అన్నింటినీ రాజమౌళినే లీక్ చేశారంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఈ టైటిల్స్ లీక్స్ వెనక ఉన్న అసలైన అంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. దీనికి ప్రస్తుతం వర్కింట్ టైటిల్‌గా SSMB 29 అని పెట్టారు. కొంతమంది SSRMB అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా… ఇప్పటి వరకు అయితే, దీనికి టైటిల్ కన్ఫర్మ్ కాలేదు.
కానీ, చాలా రోజుల నుంచి ఈ SSMB 29 మూవీటి టైటిల్ కన్ఫర్మ్ అయిందని, రాజమౌళి ఫిక్స్ చేశాడు అంటూ కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి. అలా ఇప్పటి వరకు 4 టైటిల్స్ బయటికి వచ్చాయి.
SSMB 29 మూవీ టైటిల్ ఇదే అంటూ మొత్తం నాలుగు పేర్లు వచ్చాయి. ఫస్ట్ వినిపించిన టైటిల్ ‘మహరాజ్’. దీని తర్వాత జెన్ 63, గ్లోబెట్రోటర్ అనే పేర్లు టైటిల్స్ గా వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా SSMB 29 మూవీ టైటిల్ ఇదే అంటూ వారణాసి పేరు బయటికి వచ్చింది.
ఈ నాలుగు టైటిల్స్ లో ఇది బాగుంది అంటూ ఇటు రాజమౌళి అభిమానులు… అటు మహేష్ బాబు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు టైటిల్ ఏది ఫిక్స్ అయిందో అనే మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు.
ఇది పక్కన పెడితే, ఇప్పుడు ఇండస్ట్రీలో దీని గురించి ఓ సంచలన టాపిక్ చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు బయటికి వచ్చిన టైటిల్స్‌ను రాజమౌళి టీం కావాలనే లీక్ చేసిందట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా… ఇది నిజమే అని టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది.
నిజానికి ఆ టైటిల్స్ SSMB 29 కి పరిశీలనలో ఉన్నాయట. ఇందులో ఏది సెట్ అయితే, దాన్ని SSMB 29 కి టైటిల్‌గా ఫిక్స్ చేయాలని అనుకున్నారట. అయితే, వీటిని బయటికి లీక్ చేస్తే.. ఏ టైటిల్‌కు ఆడియన్స్ నుంచి ఎక్కువ రీచ్ వస్తే దాన్నే ఫైనల్ చేయాలనే ప్లాన్ రాజమౌళికి అండ్ వాళ్ల టీం కి ఉందట. అందుకే ఆ టైటిల్స్‌ను లీక్ చేశారనే మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
కాగా, ఇప్పటి వరకు వచ్చిన టైటిల్స్‌లో జెన్ 63, గ్లోబెట్రోటర్ అనే రెండు టైటిల్స్‌కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండింట్లో గ్లోబల్ అప్పిరియన్స్ ఉందంటూ టాక్ వచ్చింది. నిజానికి SSMB 29 మూవీని రాజమౌళి గ్లోబల్ రెంజ్‌లో తీస్తున్నారు. టైటిల్ కూడా గ్లోబల్ ఆడియన్స్‌కు అర్థమైయ్యేలా ఉంటే బాగుందటనే టాక్ కూడా వస్తుంది.
మరి కొంత మంది, మహరాజ్ టైటిల్ వైపు మొగ్గుచూపిస్తున్నారు. మరి కొంత మంది వారణాసి టైటిల్ కూడా బానే ఉందనే ఫీడ్ బ్యాక్ వస్తుంది. నిజానికి మూవీ స్టోరీ వారణాసి నేపథ్యంలోనే ఉంటుందట. అందుకే ఆ టైటిల్ మూవీకి సరిగ్గా సెట్ అవుతుందని, మన భారతీయ పూరాతణ ఆలయం గురించి కూడా వరల్డ్ వైడ్ వినిపించే అవకాశం ఇది అని అనేవాళ్లు కూడా ఉన్నారు.
టైటిల్ లీక్ చేస్తే, హెల్ప్ అవుతుంది అనుకున్న జక్కన్నకు ఇప్పుడు కొంత మేర కన్ఫ్యూజ్ కూడా అయి ఉండొచ్చు. చూడాలి మరి జక్కన్న ఈ లీక్స్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో…